Share News

BJP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ఎన్డీయేకు 324 సీట్లు

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:00 AM

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 324 సీట్లు వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ 260 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది...

BJP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ఎన్డీయేకు 324 సీట్లు

  • ఇండీ కూటమికి 208 మాత్రమే

  • ఇండియా టుడే-సీ ఓటర్‌ సర్వే

  • బిహార్‌లో ఎన్డీయేదే విజయం

  • టైమ్స్‌ నౌ- జేవీసీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 324 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ 260 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కంటే బీజేపీకి స్థానాలు పెరిగినా... వచ్చేసారీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం (272) దక్కదని తెలిపింది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమికి 208 సీట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. గత ఎన్నికల్లో మొత్తం 543కు బీజేపీ కేవలం 240 స్థానాలే గెలుచుకుంది. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాల కంటే 32 తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీయేకు 293 స్థానాలు వచ్చాయి. ఇండి కూటమి 234 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో ఎన్డీయే పుంజకున్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేను జూలై 1, ఆగస్టు 14 మధ్య నిర్వహించారు. అన్ని లోక్‌సభ స్థానాల్లోని 54,788 మంది అభిప్రాయాలను సేకరించారు. ఇంకోవైపు.. త్వరలో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యమని టైమ్స్‌ నౌ-జేవీసీ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలకు ఎన్డీయే 136 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన మహాగఠ్‌బంధన్‌ 75 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆర్జేడీ 52, కాంగ్రెస్‌ 10 స్థానాలకు పరిమితమవుతాయని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23, కాంగ్రె్‌సకు 9 సీట్లు తగ్గుతాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 03:00 AM