Share News

Suresh Raina: నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సురేశ్ రైనా

ABN , Publish Date - Aug 13 , 2025 | 07:37 AM

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

Suresh Raina: నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సురేశ్ రైనా
Suresh Raina ED Summons

ఇంటర్నెట్ డెస్క్: బెట్టింగ్స్ యాప్స్‌ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులను ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా నేడు మాజీ టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా కూడా విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా ఈడీ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. బెట్టింగ్ యాప్స్ రైనా ప్రచారం కల్పించారా అన్న కోణంలో ప్రశ్నించనున్నారు. బెట్టింగ్స్‌ యాప్స్‌కు ప్రచారం కల్పించిన ఆరోపణలపై ఈడీ దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

ఇక తెలంగాణ పోలీసులు కూడా ఈ ఉదంతంలో కేసు దాలు చేసిన పలువురు సెలబ్రిటీలను ప్రశ్నించారు. ఇటీవల సినీ నటుడు రానా కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. తాను గేమింగ్స్ యాప్స్‌కే తప్ప బెట్టింగ్ యాప్స్‌కు ఎలాంటి ప్రచారం చేయలేదని అన్నారు. సోమవారం 10.30 గంటలకు విచారణకు హాజరైన ఆయన మధ్యాహ్నం సుమారు 3 గంటలకు తిరిగి వెళ్లారు. మరోవైపు, ఈడీ ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించింది. కాగా ఇదే కేసు విచారణలో భాగంగా ఈరోజు నటి మంచి లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు.


ఇక గతేడాది వెలుగులోకి వచ్చిన మహ్‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్ కేసులో కూడా అధికారులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు హైప్రొఫైల్ సెలబ్రిటీలు, అధికారులను ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌‌ను ప్రశ్నించారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవహారం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని అన్నారు.

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా భారత్ తరపున 2005లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. భారత్ మిడిల్ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌‌గా పలు మ్యాచుల్లో తన సత్తా చాటాడు. తన కెరీర్‌తో మొత్తం 200 వన్డేలు, 78 టెస్టు మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో పలు సీజన్‌లలో చెన్నై తరపున బరిలోకి దిగాడు.


ఇవి కూడా చదవండి

తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్

జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 11:27 AM