Supreme Court: కుటుంబం గడవడం కష్టమనుకుంటేనే ‘కారుణ్య నియామకం’!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:16 AM
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకం కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది. అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అంతే తప్ప మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయన్న కారణంతో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది.

ఉద్యోగి మరణించిన ప్రతి కేసులోనూ
వారసులకు కొలువు ఇవ్వడం సరికాదు
మృతుల కుటుంబ జీవన ప్రమాణాలు
పడిపోతాయంటూ నియమించనక్కర్లేదు.. సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకం కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది. అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అంతే తప్ప మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయన్న కారణంతో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం మొత్తం నడుస్తున్న పరిస్థితుల్లో.. ఆ ఉద్యోగి మరణిస్తే, అతని/ఆమె కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది ‘కారుణ్య నియామకం’ ఉద్దేశమని వివరించింది.
కెనరా బ్యాంకు ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించగా.. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు ఉన్నతాధికారి తిరస్కరించారు. దాన్ని సవాలు చేస్తూ అజిత్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News