Share News

Temple Wealth Belongs To The Deity: దేవస్థానం సంపద దేవునిదే.. సుప్రీం సంచలన తీర్పు

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:28 PM

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది.

Temple Wealth Belongs To The Deity: దేవస్థానం సంపద దేవునిదే.. సుప్రీం సంచలన తీర్పు
Temple Wealth Belongs To The Deity

దేవస్థానాలకు సంబంధించిన సంపదపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనిపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కేరళ హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు తెలిపింది.


విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘సహకార బ్యాంకుల్ని కాపాడటం కోసం గుడి డబ్బుల్ని వాడతారా? దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలి. అది ఆదాయ మార్గం కాకూడదు. సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడుదు. సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని పొందాలి. కస్టమర్లను ఆకర్షించలేకపోవటం.. డిపాజిట్లు తెచ్చుకోలేకపోవటం అన్నది సహకార బ్యాంకుల సమస్య’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధం

అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు.. తొలిసారి స్పందించిన ఆండ్రీ రస్సెల్

Updated Date - Dec 05 , 2025 | 02:50 PM