Supreme Court Notice: రాష్ట్రపతి సందేహాలపై మీ స్పందన తెలపండి
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:50 AM
బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట గడువు అంశంలో రాష్ట్రపతి ప్రస్తావించిన 14 కీలక ప్రశ్నలపై
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, జూలై 22: ‘బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట గడువు’ అంశంలో రాష్ట్రపతి ప్రస్తావించిన 14 కీలక ప్రశ్నలపై అభిప్రాయాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వచ్చే నెల నుంచి విచారణను కొనసాగిస్తామని, ఈ నెల 29న షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది. ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, యావత్ దేశానికి వర్తించేదని పేర్కొంది. వచ్చే మంగళవారానికల్లా కేంద్రం, రాష్ట్రాలు స్పందన తెలియజేయాలని సూచించింది. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఏప్రిల్ 8 సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి