Share News

Supreme Court: ఆయన మీ స్నేహితుడా.. వర్మ అని పిలుస్తున్నారు..!

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:13 AM

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు..

Supreme Court: ఆయన మీ స్నేహితుడా.. వర్మ అని పిలుస్తున్నారు..!
Supreme Court

  • లాయర్‌ నెడుంపారాపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ, జూలై 21: ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను.. కేవలం ‘వర్మ’ అంటూ సంభోదించిన న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని.. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ న్యాయవాది మాథ్యూ నెడుంపారా కోర్టును కోరారు. తాను మూడోసారి ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నానని.. ఒక సమయంలో జస్టిస్‌ వర్మను కేవలం ‘వర్మ’ అని ఆయన సంబోధించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జస్టిస్‌ వర్మ మీకేమైనా స్నేహితుడా..? ఇప్పటికీ ఆయన హైకోర్టు న్యాయమూర్తిగానే ఉన్నారని మరిచిపోయారా?’ అంటూ న్యాయవాది నెడుంపారాపై సీరియస్‌ అయ్యారు. దీంతో నెడుంపారా.. ‘ఆ గొప్పతనం ఆయనకు వర్తించదు’ అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే తమకు పాఠాలు చెప్పొదంటూ జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం మరోసారి మండిపడింది. పిటిషన్‌ అత్యవసర విచారణకు నిరాకరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:13 AM