Supreme Court Rules POSH Act: రాజకీయ పార్టీలకు పోష్ వర్తించదన్న సుప్రీం
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:26 AM
రాజకీయ పార్టీలకు ‘పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిరోధక, పరిహార చట్టం (పీఓఎ్‌సహెచ్-పో్‌ష)-2013 వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు పని స్థలాలు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: రాజకీయ పార్టీలకు ‘పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిరోధక, పరిహార చట్టం (పీఓఎ్‌సహెచ్-పో్‌ష)-2013 వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు పని స్థలాలు కాదని, అందులో చేరిన వారు ఉద్యోగులు కాదని తెలిపింది. ఆ కారణంగా ‘పోష్’ను వర్తింపజేయలేమని ధర్మాసనం తెలిపింది. పార్టీలో చేరిన వారు ఉద్యోగులు కారని, వారంతా స్వచ్ఛందంగా చేరుతారని పేర్కొంది. ఒకవేళ అమలు చేస్తే ఆ చట్టం దుర్వినియోగమవుతుందని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు పెరుగుతాయని వ్యాఖ్యానించింది. తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని తెలిపింది. మహిళా కార్యకర్తలపై జరిగే వేధింపులను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని ప్రయోగించాలని కోరుతూ కేరళకు చెందిన యోగమాయ ఎం.జి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. పార్టీలో యజమాని-ఉద్యోగి సంబంధం ఉండదంటూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీనిపై ఆమె సుప్రీంలో అప్పీలు చేశారు.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి