Supreme Court: వినియోగదారుల ఫోరమ్‌ల అధికారాల పునరుద్ధరణ
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:46 AM
వినియోగదారుల ఫోరమ్‌ల అధికారాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది..
అన్ని రకాల ఆదేశాలను అమలు చేసేలా సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 24: వినియోగదారుల ఫోరమ్‌ల అధికారాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాటి అన్ని తుది, మధ్యంతర ఆదేశాలను సివిల్ కోర్టు డిక్రీలుగా పరిగణిస్తూ అమలు చేసే అధికారాన్ని కల్పిస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం వేలాది మంది వినియోగదారులకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పటికీ.. నిజమైన ఉపశమనం లభించని దాదాపు 18 ఏళ్ల చట్టపరమైన లొసుగుకు ముగింపు పలికింది. ‘ప్రతి ఆర్డర్’ అనే పదం స్థానంలో ‘మధ్యంతర ఆర్డర్’ అని మారుస్తూ వినియోగదారుల పరిరక్షణ చట్టానికి (సీపీఏ) 2002లో చేసిన సవరణ.. ఫోరమ్‌ల అధికారాలను నీరుగార్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది. వాటి సొంత తుది తీర్పులను కూడా అమలు చేయకుండా నిరోధించిందని పేర్కొంది. 1986 చట్టంలోని సెక్షన్ 25 ‘ఏ ఆదేశాన్ని’ అయినా అమలు చేసే అధికారాన్ని ఫోరమ్‌లకు కల్పిస్తుందని పేర్కొంది
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News