Supreme Court: ఇక చాలు, ఇంకా ఎన్ని పిటిషన్లు వేస్తారు? ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:51 PM
అయోధ్య వివాదం ముగిసిన తర్వాత కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి, శ్రీకృష్ణ జన్మస్థలం-మధుర ఈద్గావ్, శంభాల్ ధర్మా వంటి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

న్యూఢిల్లీ: ప్రార్థనా స్థలాల (Special Provisions) చట్టం-1991 కింద దాఖలైన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఇంకెన్ని పిటిషన్లు దాఖలు చేస్తారు? దేనికైనా ఒక ముగింపు అనేది ఉండాలి'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖాన్నా నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Qatar Amir: ఖతార్ అమీర్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన మోదీ
ఈ అంశంపై అదనపు పిటిషన్లను అనుమతించేది లేదని సీజేఐ ఖన్నా స్పష్టం చేస్తూ... ''పిటిషన్లు వేయడానికైనా ఒక పరిమితంటూ ఉండాలి. ఇక చాలు. దీనికి ఒక ముగింపు ఉండాలి" అని అన్నారు. అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్లు దాఖలు చేయడానికి ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. త్రిసభ్య న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ చేపడుతుంది.
అయోధ్య వివాదం ముగిసిన తర్వాత కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి, శ్రీకృష్ణ జన్మస్థలం-మధుర ఈద్గావ్, శంభాల్ ధర్మా వంటి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కాంగ్రెస్, మజ్లిస్ సహా పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.