Share News

Supreme Court: ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీంకోర్టు 'నో'

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:39 PM

పునరావృద్ధి ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలని యూఏఈకి చెందిన సీలింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఈ పిటిషన్ వేసింది. తాము గతంలో వేసిన బిడ్‌ను తోసిపుచ్చి అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు ధారావా ప్రాజెక్టు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సవాలు చేసింది.

Supreme Court: ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీంకోర్టు 'నో'

న్యూఢిల్లీ: దేశంలోనే అది పెద్ద మురికివాడల పునరావాస కార్యక్రమంగా చేపడుతున్న ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు (Dharavi Redevelopment Project) నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Corut) శుక్రవారంనాడు నిరాకరించింది. అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా మంబై హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం


పునరావృద్ధి ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలని యూఏఈకి చెందిన సీలింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఈ పిటిషన్ వేసింది. తాము గతంలో వేసిన బిడ్‌ను తోసిపుచ్చి అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు ధారావా ప్రాజెక్టు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సవాలు చేసింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టివ్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాజెక్టులో రైల్వే లైన్‌కు చేర్చి డవలప్ చేయాలని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. కొన్ని రైల్వే క్వార్డర్స్‌ కూల్చివేతతో సహా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని పేర్కొంటూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం, అదానీ ప్రాపర్టీస్ వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ మే 25వ తేదీకి వాయిదా వేసింది.


ధారావి రీడవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం రూ.7,200 కోట్లకు బిడ్ వేసిన సీలింగ్ టెక్నాలజీస్ మరో 20 పర్సంట్ పెంచేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టుకు విచారణ సందర్భంగా వివరించింది. దీంతో రివైస్ట్ బిడ్‌తో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ధర్మానసం సీలింగ్ టెక్నాలజీస్‌ను ఆదేశించింది.


ధారావి రీడవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం సీలింగ్ టెక్నాలజీస్ 2019లో బిడ్ వేసింది. దానిని మహారాష్ట్ర ప్రభుత్వం కేనిల్స్ చేసి, 2022లో ఫ్రెష్ టెండర్ జారీ చేసింది. అంతిమంగా అదానీ గ్రూప్‌కు ప్రాజెక్టు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని ముంబై హైకోర్టు 2024లో సమర్ధించింది. దీనిపై సీలింక్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, సీలింక్ బిడ్‌ను తోసిపుచ్చి ఫ్రెష్ టెండర్ జారీ చేయడం, అదానీ గ్రూప్‌కు ప్రాజెక్టు అప్పగించడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. 2019-2022 మధ్య ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరెన్సీ ఆటుపోట్లు, వడ్డీరేట్లు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతోంది.


ఇవి కూడా చదవండి

Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు

భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2025 | 04:40 PM