Share News

Bihar Voter List Controversy: బిహార్‌లో 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారు

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:56 AM

సెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో.. ముసాయిదా ఓటరు జాబితాల నుంచి తొలగించిన 65 లక్షల

Bihar Voter List Controversy: బిహార్‌లో 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారు

  • ఆ ఓటర్ల వివరాలు మాకు అందించండి

  • ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం

  • బిహార్‌ ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన

  • తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు మాకివ్వండి

  • ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో.. ముసాయిదా ఓటరు జాబితాల నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను తమకు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 9 నాటికి(ఎల్లుండి) తమకు ఆ వివరాలు చేరాలని పేర్కొంది. ఆ ఓటర్లను ఏ ప్రాతిపదికన తొలగించారో తాము కూడా తెలుసుకుంటామని స్పష్టం చేసింది. అదేవిధంగా తొలగించిన ఓటర్ల వివరాలతో కూడిన కాపీని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌)కు కూడా అందించాలని స్పష్టం చేసింది. బిహార్‌లో ఓటరు జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌) కోసం ఈసీ జారీ చేసిన ఆదేశాలను ఏడీఆర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీంతోపాటు తాజాగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లు, వివరాలను బహిరంగంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. జాబితాల నుంచి తీసేసిన ఓటర్లు.. మృతి చెందారా?. శాశ్వతంగా వలసపోయారా?. లేక ఏ ఇతర కారణాలతోనైనా వారిని తొలగించారా?. అనే విషయాలను స్పష్టం చేయాలని కూడా ఏడీఆర్‌ కోరింది. బుధవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 03:56 AM