Supreme Court: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ‘పిల్’ తిరస్కరణ
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:56 AM
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బంకుల్లో 20 శాతం ఇథనాల్‌ను కలిపిన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బంకుల్లో 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్ (ఈబీపీ-20)ని విక్రయిస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2023కు ముందు తయారు చేసిన బైకులు, కార్లు ఈబీపీ-20 వినియోగానికి అనువుగా లేవని తెలిపారు. ఈబీపీ-20 కారణంగా వాహనాల మైలేజీ తగ్గుతోందని, ఇంజిన్లు పాడవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల బంకుల్లో ఇథనాల్ రహిత సాధారణ పెట్రోలు విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఆ వాదనను ఖండించారు. ఈబీపీ-20 కారణంగా చెరకు రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన మల్హోత్రా పేరుకు మాత్రమే కక్షిదారు అని, ఆయన వెనుక లాబీ ఉందని తెలిపారు. ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలిస్తోందని చెప్పారు. దీనితో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పిల్‌ను తిరస్కరించింది.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.51.50 తగ్గింపు
వరుసగా ఆరోసారి దిగివచ్చిన ధర
ఏటీఎఫ్ ధర 1.4 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌తోపాటు విమాన ఇంధనం ధర (ఏటీఎ్‌ఫ)ను ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సోమవారం తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిలో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19 కిలోలు) ధరను కంపెనీలు రూ.51.50 మేర తగ్గించడంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1,580కు చేరుకుంది. తాజా తగ్గింపుతో వాణిజ్య ఎల్పీజీ రేట్లు వరుసగా ఆరోసారి తగ్గినట్టయింది. ఇంతకుముందు ఆగస్టు 1న ఈ సిలిండర్ ధర రూ.33.50 మేర తగ్గింది. ఏప్రిల్ నుంచి చూస్తే ఈ సిలిండర్ ధర మొత్తంగా రూ.223 మేర దిగివచ్చింది. ఇక గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం యథాతథంగా ఉంది. కాగా ఏటీఎఫ్ ధరను చమురు కంపెనీలు 1.4 శాతం మేర తగ్గించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.1,308.41 తగ్గి రూ.90,713.52కు చేరుకుంది. ఇంతకు ముందు వరుసగా రెండుసార్లు ఏటీఎఫ్ ధరలను కంపెనీలు పెంచాయి. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో అందుకనుగుణంగా దేశీయంగా ధరలు పెరిగాయి.
ఇవి కూడా చదవండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్
ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి