Share News

NASA: మార్చి 19న భూమిపైకి సునీతా విలియమ్స్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:54 AM

ఆమె మార్చి 19న తిరిగి రానున్నారు. గత ఏడాది వేసవిలో ఐఎ్‌సఎ్‌సలో విధుల నిర్వహణ నిమిత్తం ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు... సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్‌మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

NASA: మార్చి 19న భూమిపైకి సునీతా విలియమ్స్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌-ఐఎ్‌సఎ్‌స)లో గత ఎనిమిది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు భూమి మీదకి తిరిగి రానున్నారు. ఆమె మార్చి 19న తిరిగి రానున్నారు. గత ఏడాది వేసవిలో ఐఎ్‌సఎ్‌సలో విధుల నిర్వహణ నిమిత్తం ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు... సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్‌మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారి ప్రయాణించిన బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ క్యాప్స్యూల్‌లో లోపాలు తలెత్తడంతో తిరిగిరాలేకపోయారు. ఇది అమెరికాలో తీవ్ర ఆందోళన కలిగించింది. దాంతో వారిని తిరిగి తీసుకు రావాలని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టిగా డిమాండు చేశారు. ఆ ప్రయివేటు సంస్థ అంతరిక్షానికి వ్యోమనౌకలను పంపిస్తుండడంతో ట్రంప్‌ ఆ డిమాండు చేశారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు క్రూ-10 విభాగానికి చెందిన నలుగురు వ్యోమగాములను తీసుకెళ్తున్న డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగు ప్రయాణంలో సునీత, విల్‌మోర్‌లను భూమిపైకి తీసుకురానుంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 04:54 AM