Share News

Jagannath Rath Yatra 2025: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి, 10 మందికి పైగా గాయాలు

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:18 AM

ఒడిశా పూరీలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra 2025) సందర్భంగా విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో శ్రీగుండిచా ఆలయం సమీపంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అనుకోకుండా తొక్కిసలాట జరిగింది.

Jagannath Rath Yatra 2025: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి, 10 మందికి పైగా గాయాలు
Jagannath Rath Yatra 2025

ఒడిశా పూరీలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra 2025) సందర్భంగా ఆధ్యాత్మికత వాతావరణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో శ్రీగుండిచా ఆలయం సమీపానికి లక్షలాది మంది భక్తులు దైవ దర్శనానికి ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మహా ఉత్సవాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు వచ్చిన భక్తుల ఆశలు క్షణాల్లోనే విషాదంగా మారాయి.


నియంత్రణ కష్టం

ఈ ఘటన సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని దర్శనం కోసం జనాలు భారీగా తరలివచ్చారు. దర్శన సమయంలో జన సమూహాన్ని నియంత్రించడం అక్కడి సిబ్బందికి చాలా కష్టంగా మారింది. ఆ క్రమంలో జనాలు ఒకరినొకరు తోసుకుంటూ నేలపై పడిపోయారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తింది. దీంతో ముగ్గురు మరణించగా, మృతులందరూ ఖుర్దా జిల్లాకు చెందినవారని చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ప్రభాతి దాస్, బసంతి సాహు ఉన్నారు. మృతుల్లో 70 ఏళ్ల ప్రేమకాంత్ మహంతి కూడా ఉన్నారు.


మతపరమైన తీర్థ యాత్రలలో ఒకటి

పూరీ జగన్నాథ రథయాత్ర దేశంలోని అతిపెద్ద మతపరమైన తీర్థ యాత్రలలో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను చూసేందుకు పూరీకి చేరుకుంటారు. రథయాత్ర సమయంలో, భగవంతుడిని శ్రీమందిర్ నుంచి బయటకు తీసుకువచ్చి శ్రీ గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. అక్కడ ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఈ ప్రయాణ సమయంలో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. శనివారం రథయాత్ర ప్రారంభంలో కూడా తొక్కిసలాట జరిగి 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.


10 వేల మందితో..

ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)కు చెందిన దాదాపు 10,000 మంది సిబ్బందిని వార్షిక రథయాత్ర భద్రత కోసం ఏర్పాటు చేశారు. జన సమూహాన్ని పర్యవేక్షించడానికి 275కి పైగా CCTV కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఖురానియా తెలిపారు. గుండిచా ఆలయం 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయం నుంచి 2.6 కి.మీ దూరంలో ఉంది. ఈ సంవత్సరం జూలై 5న జరిగే తిరుగు ప్రయాణ రథయాత్రను బహుద యాత్ర అని పిలుస్తారు.


ఇవీ చదవండి:

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 10:00 AM