Israel Gaza Attacks: ఇజ్రాయెల్ నరమేధంపై మౌనం వీడండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:01 AM
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ, ఇప్పటివరకు వేలాదిమంది పౌరులను, పిల్లలను చంపివేసినా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని కాంగ్రెస్ నాయకురాలు...
గాజాలో వేలాదిమందిని చంపేస్తున్నా.. ఏమీ పట్టనట్టు ప్రధాని మోదీ పూర్తి మౌనం
ఓ ఆంగ్ల పత్రికకు సోనియా సంపాదకీయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 : పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ, ఇప్పటివరకు వేలాదిమంది పౌరులను, పిల్లలను చంపివేసినా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. ఇజ్రాయెల్ చర్యను నరమేధంగా (జెనోసైడ్) దుయ్యబట్టిన ఆమె.. కనీస నైతికత, మానవత లేనివారే మోదీలా పూర్తి మౌనం వహిస్తారని ఆమె ఆక్షేపించారు. ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు ‘పాలస్తీనాపై భారత్ మౌనం, ఎడబాటు’ అనే శీర్షికతో సోనియా సంపాదకీయం రాశారు. పాలస్తీనాకు మద్దతుగా భారత్ మరోసారి తన చారిత్రక నాయకత్వ పాత్రను పోషించాలని, పాలక దౌత్యనీతిని పక్కనబెట్టి దేశ ప్రజలు పాలస్తీనా కోసం మాట్లాడాలని ఆ వ్యాసంలో కోరారు. కాగా, పాలస్తీనా సమస్యపై పత్రికలకు సోనియా వ్యాసం రాయడం ఇది మూడోవది. కాగా, కాంగ్రెస్ వ్యవహారాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఓ ఆంగ్ల పత్రికకు సోనియా రాసిన వ్యాసాన్ని సమర్థించారు. గాజాపై జరుపుతున్న మారణహోమం అన్ని హద్దులు దాటేసిందనీ, నిర్దయ దాడులను వెంటనే కట్టిపెట్టాలనీ ఇజ్రాయెల్‌కు తెలపాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News