Firing at Nagrota Army Station: నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై ఆగంతుకుడి కాల్పులు.. సెంట్రీకి స్వల్ప గాయాలు
ABN , Publish Date - May 11 , 2025 | 12:21 AM
జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో అక్కడి సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడి కోసం సైనికులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఓ సైనికుడు గాయాలపాలయ్యారు. ఈ మేరకు వైట్ నైట్ కోర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పులకు తెగబడ్డ నిందితుడి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఆర్టీ స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కదలాడుతుండటం గమించిన సెంట్రీ ఆగంతుకుడికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో, నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. చొరబాటుదారుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం’’ అని ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
నాగ్రోటాతో పాటు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్.. డ్రోన్‌లు, ఆర్టిలరీ దాడులకు పాల్పడిన సమయంలో ఆగంతుకుడు ఆర్మీ స్టేషన్‌ను టార్గెట్ చేశాడు. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటలకే పాక్ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు తప్పవని ఈ సందర్భంగా దోవల్ బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి
కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్థాన్
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి