Landmine Blast: మందుపాతర పేలి ఆరుగురు జవాన్లకు గాయాలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:49 PM
సరిహద్దుల భద్రత, చొరబాట్ల నిరోధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మందుపాతరపై గస్తీ జవాను ఒకరు కాలు వేయడంతో అది పేలిందని, దీంతో ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

రాజౌరి: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో పేలుడు సంభవించింది. రాజౌరీ (Rajouri) జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రాజౌరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఖంబ ఫోర్ట్ సమీపంలో గోర్భా రైఫిల్స్ గస్తీ నిర్వహిస్తు్న్న సమయంలో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో పేలుడు ఘటన సంభవించింది.
Arvind Kejriwal: గోల్డ్ చైన్‌లు పంచుతున్నారు, తీసుకోండి కానీ...
సరిహద్దుల భద్రత, చొరబాట్ల నిరోధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక మందుపాతరపై గస్తీ జవాను ఒకరు కాలు వేయడంతో అది పేలిందని, దీంతో ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వర్షాల కారణంగా మందుపాతరలు డిస్‌ప్లేస్ అవుతుంటాయని చెబుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించి ఇతమిత్థమైన కారణంపై ఆర్మీ విచారణ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News