Kerala YouTuber: కేరళ యూట్యూబర్ మునా్‌ఫకు సిట్ నోటీసు
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:43 AM
ధర్మస్థల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కేరళకు చెందిన యూట్యూబర్ మునా్‌ఫకు నోటీసులు జారీ చేశారు..
ధర్మస్థల వివాదంపై ముగ్గురిని విచారించిన సిట్ చీఫ్
బెంగళూరు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ధర్మస్థల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కేరళకు చెందిన యూట్యూబర్ మునా్‌ఫకు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై 11న ధర్మస్థల అటవీప్రాంతం నుంచి ఓ పుర్రెను తీసుకొస్తున్న వీడియోనూ మునాఫ్ తన యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో మాజీ పారిశుధ్య కార్మికుడు చన్నయ్య ఓ కత్తితో పుర్రెను ఎత్తుకొస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇదంతా కల్పితమని, అటవీ ప్రాంతంలో పుర్రె లభించలేదని చన్నయ్య సిట్ ఎదుట తెలిపారు. జయంత్, గిరీశ్ ఇచ్చిన పుర్రెను కత్తితో తీసుకొచ్చానని వివరించారు. దీంతో కుట్రలో మునాఫ్ పాత్ర గురించి తెలుసుకునేందుకు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ధర్మస్థల వివాదానికి సూత్రధారులుగా భావిస్తున్న జయంత్, గిరీశ్ మట్టణ్ణవర్, అభిషేక్‌ను సిట్ శుక్రవారం విచారించింది. వారిని సిట్ కార్యాలయానికి పిలిపించి, వేర్వేరుగా సుదీర్ఘ సమయంపాటు విచారించారు. మరోవైపు మండ్యకు చెందిన ‘గోల్డెన్ కన్నడిగ’ యూట్యూబర్ సుమంత్ బాంబు పేల్చారు. ధర్మస్థల వివాదంపై యూట్యూబ్‌లో పోస్టు పెట్టాలని ‘యునైటెడ్ మీడియా’ యూట్యూబర్ అభిషేక్ తనకు సూచించారని సుమంత్ తెలిపారు. పోస్టు పెడితే ఫండింగ్ సాధ్యమవుతుందని అభిషేక్ చెప్పారని అన్నారు. ఫండింగ్ చేసేవారు ఎవరని అడిగానని, మహేశ్ తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్ తమ బాస్‌లని, అంతా వారే చూసుకుంటారని ఆయన తెలిపారని అన్నారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News