Share News

Silver price prediction: సిల్వర్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. మూడేళ్లలో కేజీ వెండి ధర ఎంతవుతుందంటే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:10 AM

వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయా? రాబోయే మూడేళ్లలో కిలో వెండి ధర 2 లక్షల రూపాయలను తాకనుందా? అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Silver price prediction: సిల్వర్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. మూడేళ్లలో కేజీ వెండి ధర ఎంతవుతుందంటే..
silver price forecast

వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయా? రాబోయే మూడేళ్లలో కిలో వెండి ధర 2 లక్షల రూపాయలను తాకనుందా? అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు (Rs 2 lakh silver). మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో శుక్రవారం నాడు వెండి ఫ్యూచర్స్ సెప్టెంబర్ కాంట్రాక్టులలో కిలోగ్రాముకు రూ.1,17,250 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. అలాగే శక్తివంతమైన ర్యాలీని సూచిస్తూ బంగారం నుంచి దృష్టిని మరల్చుతోంది (silver price prediction India).


పారిశ్రామిక డిమాండ్ పెరగడం, పెట్టుబడుల ప్రవాహం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు అంచనాల నేపథ్యంలో వెండి ధరలు పెరిగాయి (silver investment trend). 2028 నాటికి వెండి ధర కిలోకు రూ.2,00,000కి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు 5 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే దేశీయ మార్కెట్ల ధరలు కూడా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రూపాయి బలహీనపడడం, ఫెడ్ రేటు కోత అంచనాలు కూడా వెండి ధరలకు మద్దతు ఇస్తున్నాయి. మొత్తంమీద వెండికి దీర్ఘకాలిక ధోరణి సూపర్ బుల్లిష్‌గా ఉంది.


1-9-2025 నాటికి ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 34, 900

  • విజయవాడలో రూ. 1, 34, 900

  • ఢిల్లీలో రూ. 1, 24, 900

  • చెన్నైలో రూ. 1, 34, 900

  • కోల్‌కతాలో రూ. 1, 24, 900

  • కేరళలో రూ. 1, 34, 900

  • ముంబైలో రూ. 1, 24, 900

  • బెంగళూరులో రూ. 1, 24, 900

  • వడోదరలో రూ. 1, 24, 900

  • అహ్మదాబాద్‌లో రూ. 1, 24, 900


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 11:10 AM