Share News

Shefali Jariwala: ప్రముఖ బాలీవుడ్ నటి హఠాన్మరణం

ABN , Publish Date - Jun 28 , 2025 | 06:58 AM

ప్రముఖ బాలీవుడ్ నటి, కాంటా లగా పాట ఫేమ్ షెఫాలీ జరీవాలా నిన్న రాత్రి హఠాన్మరణం చెందారు. గుండె పోటు రావడంతో ఆమె కన్నుమూసినట్టు తెలుస్తోంది.

Shefali Jariwala: ప్రముఖ బాలీవుడ్ నటి హఠాన్మరణం
Shefali Jariwala Passes Away

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు. జూన్ 27 రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు తెలుస్తోంది. 2002 నాటి ‘కాంటా లగా’ పాటతో ఆమె (Shefali Jariwala) దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, అనారోగ్యానికి గురైన షెఫాలీని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. అయితే, ఆమె మృతికి గల కారణాలను కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

2002లో ‘కాంటా లగా’ పాటలో నటించిన షెఫాలీ రాత్రి రాత్రికి పాప్ కల్చర్ సెన్సేషన్‌గా మారిపోయారు. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 2004 నాటి ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలో కూడా నటించారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో కూడా పాల్గొన్నారు. తన కాన్ఫిడెన్స్, క్లారిటీతో జనాలను ఆకట్టుకుని మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. 2015లో ఆమె యాక్టర్ పరాగ్ త్యాగీని పెళ్లి చేసుకున్నారు. ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాలిటీ షో 5, 7 సీజన్‌లలో భర్తతో కలిసి పాల్గొన్నారు.


చిన్న వయసులో ఆమె కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

కశ్మీర్‌ రిసార్ట్‌లో ఎలుగుబంటి కలకలం

పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 07:36 AM