Share News

Accident: ఎస్‌యూవీ ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు

ABN , Publish Date - Mar 10 , 2025 | 09:17 AM

కుటుంబంతోపాటు వెళ్తున్న ఓ SUV వాహనానికి ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Accident: ఎస్‌యూవీ ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు
SUV truck accident update

సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్రక్కు, SUV ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా, 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) సిద్ధి జిల్లాలోని ఉప్ని పెట్రోల్ పంప్ సమీపంలో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. SUV వాహనం ఒక కుటుంబంతో మైహార్ వైపు ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కుతో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోరమైన ప్రమాదంలో SUVలో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.


కుటుంబ సభ్యులంతా..

గాయపడిన 9 మందిని సమీపంలోని రేవా ఆసుపత్రికి తరలించామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాయత్రి తివారీ చెప్పారు. మిగిలిన వారిని సిద్ధి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తెల్లవారుజామున ప్రమాదం జరిగిన సమయంలో తేమ పరిస్థితులు ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో పెద్దలతోపాటు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. SUVలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని తెలుస్తోంది.


పోలీసుల దర్యాప్తు

దీంతోపాటు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. తేమ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం త్వరలో తెలియనుంది. మరోవైపు జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 10 , 2025 | 09:48 AM