Share News

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. అన్నాడీఎంకే పార్టీ నాదే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 01:05 PM

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత, ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) అన్నారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. అన్నాడీఎంకే పార్టీ నాదే..

- పార్టీ అపజయాలకు ఏకనాయకత్వమే కారణం

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత, ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) అన్నారు. జయ జయంతి సందర్భంగా మెరీనాబీచ్‌ కామరాజర్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి, చిత్రపటానికి ఓపీఎస్‌, ఆయన అనుచరులు పుష్పాంజలి ఘటించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: టీవీకే వార్షికోత్సవాలకు సమన్వయ కమిటీ..


ఈ సందర్భంగా ఓపీఎస్‌ మీడియాతో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ జయ పాలన రావాలని కోరుకుంటున్నారని, ఆమె బ్రతికున్నంతవరకూ పార్టీని ఉన్నతస్థితికి చేర్చారని, ఆ తర్వాత పార్టీలో ద్వంద్వ నాయకత్వం ఉన్నప్పు డు బలం బాగా పుంజుకుందన్నారు. ఏకనాయకత్వం వచ్చినప్పటి నుండి పార్టీ ప్రతిష్ట క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు.


పార్టీలోని సీనియ ర్‌ నేతలంతా పార్టీ నాశనమైనా పరవాలేదుగానీ, ఏకనాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని, ఇది మంచిది కాదన్నారు. పార్టీలో నిరంకుశధోరణి పెరుగుతున్నాయన్నారు. పార్టీ నుంచి విడిపోయినవారిందరినీ కలుపుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్నాడీఎంకే గెలిచి అధికారంలోకి వస్తుందని, అయితే ఈ దిశగా పార్టీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమని ఓపీఎస్‌ వ్యాఖ్యానించారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 01:09 PM