Hajj 2025: హజ్ యాత్రకు పిల్లల్ని అనుమతించం!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:48 AM
హజ్ యాత్రకు వచ్చే భారీ జనసందోహం వల్ల పిల్లలకు ఏ విధమైన ముప్పూ ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హజ్-ఉమ్రా మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే, మొదటి సారిగా వచ్చే యాత్రికులకు హజ్ యాత్ర-2025లో ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొంది.

హజ్ యాత్ర-2025 నిబంధనలు విడుదల చేసిన సౌదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ యాత్ర-2025 నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేసింది. పిల్లలు ఈ యాత్రలో పాల్గొనకుండా నిషేధం విధించింది. హజ్ యాత్రకు వచ్చే భారీ జనసందోహం వల్ల పిల్లలకు ఏ విధమైన ముప్పూ ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హజ్-ఉమ్రా మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే, మొదటి సారిగా వచ్చే యాత్రికులకు హజ్ యాత్ర-2025లో ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్‌యాత్ర చేయాలనే మతపరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని మరింతమందికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అలాగే, అనుమతి లేకుండా హజ్‌యాత్రలో పాల్గొనడాన్ని నివారించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి భారత్ సహా 14 దేశాల యాత్రికులకు సింగిల్ ఎంట్రీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నట్టు వివరించింది.
దీర్ఘకాలిక వీసాతో దేశంలోకి ప్రవేశించినవారు అనుమతిలేకుండా హజ్‌యాత్రలో పాల్గొనడం వల్ల రద్దీ పెరుగుతుందని పేర్కొంది. దీంతో రద్దీ నియంత్రణ కష్టమై సురక్షా పరమైన మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, యాత్రికులు అధికారిక మార్గాల్లో(చానల్స్)నేపేర్లు నమోదు చేసుకోవాలని, సమస్యల నివారణకు నూతన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది.. ఆ 14 దేశాలు.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాక్, జోర్డాన్, యెమన్, అల్జీరియా, ఈజిప్ట్, ఇతియోపియా, మొరాకో, నైజీరియా, సూడాన్, తునీసియా దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చేవారికి ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సింగిల్ ఎంట్రీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నట్టు సౌదీ ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News