Share News

Saif Ali Khan: 'కిత్నా టైమ్ లగేగా'... ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించిన సైఫ్ అలీఖాన్

ABN , Publish Date - Jan 17 , 2025 | 07:47 PM

సైఫ్ అలీఖాన్ మెడ, వీపు వెనుక రక్తం కారుతుండటం చూశానని, రక్తంతో ఆయన తెల్ల కుర్తా ఎరుపురంగులోకి మారిపోయిందని ఆటో డ్రైవర్ రానా తెలిపారు. ఆసుపత్రికి చేరిన వెంటనే తాను ఆటో ఛార్జీలు తీసుకోలేదని, సకాలంలో మనిషిని ఆదుకోవడం కంటే మంచిపని మరొకటి ఉండదని తాను భావించానని చెప్పాడు.

Saif Ali Khan: 'కిత్నా టైమ్ లగేగా'... ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించిన సైఫ్ అలీఖాన్

ముంబై: ఆగంతకుడి దాడిలో ఒంటిపై ఆరు చోట్ల తీవ్రంగా గాయపడి కూడా ఏమాత్రం బెదరకుండా నడుచుకుంటూ ఇంటి బయటకు వచ్చి ఆటోలో ఆసుపత్రికి వెళ్లిన సైఫ్ అలీఖాన్.. ఆటో డ్రైవర్‌ను అడిగిన తొలి ప్రశ్న.. 'ఎంత సమయం పడుతుంది' (కిత్నా టైమ్ లగేగా) అని. సరిగ్గా 8 నుంచి 10 నిమిషాల లోపే ముంబై ఆటోడ్రైవర్ ఆయనను లీలావతి ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. ఒంటిమీద రక్తమోడుతున్నా ఎంతో నిబ్బరం కనిపించిన సైఫ్‌పై ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా ప్రశంసలు కురిపించారు. ఆ ఘటనను వివరించారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు


''నేను ఆటోలో అటువైపు వెళ్తుండగా ఒక గేట్ వద్ద నుంచి కేకలు వినిపించాయి. ఒక మహిళ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి సాయం చేయమని, ఆటోను ఆపమని కోరింది. అయితే ఆ వచ్చేది సైఫ్ అలీఖాన్‌ అని నేను అనుకోలేదు. ఏదో చిన్న దాడి కేసు అనుకున్నాను. సైఫ్ నడుచుకుంటూ వచ్చి తనంత తానుగానే ఆటో ఎక్కారు. బాగా గాయపడిన స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన వెంటనే ఒక పిల్లవాడు, మరో వ్యక్తి ఉన్నారు. సైఫ్ ఆటోలో కూర్చోగానే ఎంత సమయం పడుతుంది? (ఆసుపత్రి చేరేందుకు) అని అడిగారు. 8 నుంచి 10 నిమిషాల్లో మేము ఆసుపత్రికి చేరాం'' అని భజన్ సింగ్ రానా తెలిపారు.


సైఫ్ అలీఖాన్ మెడ, వీపు వెనుక రక్తం కారుతుండటం చూశానని, రక్తంతో ఆయన తెల్ల కుర్తా ఎరుపురంగులోకి మారిపోయిందని రానా తెలిపారు. ఆసుపత్రికి చేరిన వెంటనే తాను ఆటో ఛార్జీలు తీసుకోలేదని, సకాలంలో మనిషిని ఆదుకోవడం కంటే మంచిపని మరొకటి ఉండదని తాను భావించానని చెప్పాడు. సైఫ్‌కు చికిత్స అందిన వైద్యులు సైతం ఆయన రక్తమోడుతున్నా స్ట్రెచర్ సాయం కూడా తీసుకోకుండా 'సింహం'లా నడుచుకుంటూ వచ్చారని ప్రశంసించారు. ఐదు గంటల సర్జరీ అనంతరం సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల ఒక పదునైన బ్లేడ్‌ను బయటకు తీశారు. ఇది ఇంకో 2 ఎంఎం లోతుగా దిగి ఉంటే చాలా తీవ్రంగా గాయపడి ఉండేవారని, చాలా అదృష్టంగా ఆయన బయటపడ్డారని వైద్యులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి..

Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 17 , 2025 | 07:47 PM