Russia Ukraine Conflict: రష్యా కష్టం.. మనకు లాభం
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:35 AM
ఉక్రెయిన్ దాడులతో దెబ్బతింటున్న రష్యా చమురుశుద్ధి కర్మాగారాలు 20% మేర శుద్ధి సామర్థ్యం తగ్గడంతో ఎగుమతులను పెంచిన మాస్కో మార్కెట్లో దొరుకుతున్న బ్రెంట్ క్రూడాయిల్ కన్నా తక్కువ ధరకే..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఒకరి నష్టం.. మరొకరికి లాభంగా మారుతుంది! ఒకరి సంక్షోభం.. మరొకరికి అవకాశమై సిరులు కురిపిస్తుంది!! నిష్ఠురంగా అనిపించినా ఇది నిజం!! తమపై దండెత్తిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ దేశ చమురుశుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులు ఉక్రెయిన్ దాడులతో దెబ్బతింటున్న రష్యా చమురుశుద్ధి కర్మాగారాలు 20% మేర శుద్ధి సామర్థ్యం తగ్గడంతో ఎగుమతులను పెంచిన మాస్కో మార్కెట్లో దొరుకుతున్న బ్రెంట్ క్రూడాయిల్ కన్నా తక్కువ ధరకే.. ఆ చమురును కొని శుద్ధి చేసి, అమ్మి లాభపడుతున్న భారత రిఫైనరీలు భారతదేశంలోని రిఫైనరీల పంట పండిస్తున్న వైనమే ఇందుకు ఉదాహరణ. గుర్తుందా.. కిందటి నెలలో ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో రష్యావ్యాప్తంగా ఉన్న పలు కీలక రిఫైనరీల సామర్థ్యం భారీగా దెబ్బతింది. దీంతో.. రష్యా తన చమురుశుద్ధి సామర్థ్యంలో దాదాపు 20 శాతం మేర కోల్పోయింది. ఆ దేశ రోజువారీ చమురు శుద్ధి సామర్థ్యంలో 11 లక్షల బ్యారెళ్లకు సమానం ఇది. శుద్ధి సామర్థ్యం తగ్గిపోవడంతో రష్యా రోజూ చేసే ఎగుమతులకు అదనంగా మరో 2 లక్షల బ్యారెళ్ల ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. అది కూడా.. ఒపెక్ దేశాలు అమ్మే బ్రెంట్ క్రూడ్ కన్నా తక్కువ ధరకు. బ్రెంట్ క్రూడాయిల్‌తో పోలిస్తే రష్యా విక్రయిస్తున్న ఉరల్స్ ముడి చమురు ఒక బ్యారెల్‌కు 5-6 డాలర్ల దాకా తక్కువకు వస్తుండడంతో భారతదేశానికి చెందిన రిఫైనరీలు ఆ చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, ఇక్కడ శుద్ధి చేసి మార్కెట్ రేట్లకు విదేశాలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో యూరప్ దేశాలకు మనదేశం నుంచి డీజిల్ ఎగుమతులు 137ు మేర పెరిగి రోజుకు 2,42,000 బ్యారెళ్లకు చేరాయి.
ఆగస్టు 15 దాకా సగటున రోజుకు 15 లక్షల బ్యారెళ్ల ఉరల్స్ ముడిచమురు రష్యా నుంచి మన దేశానికి దిగుమతి అవుతుండగా.. ఆగస్టు నెలాఖరుకు అది రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు చేరింది. ఇలా అదనంగా దిగుమతి చేసుకుని, శుద్ధి చేసి విక్రయిస్తున్న చమురు కారణంగా రిలయన్స్ సంస్థకు ఏటా అదనంగా సుమారు 500 మిలియన్ డాలర్ల నిర్వహణ లాభం వచ్చే అవకాశం ఉందని జెఫ్రీస్ సంస్థ అంచనా. క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వె్‌స్టమెంట్స్ గ్రూప్ సీఎల్‌ఎ్‌సఏ అంచనాల ప్రకారం.. రష్యా క్రూడ్ రాయితీల కారణంగా భారతదేశం ఏటా రూ.22 వేల కోట్ల మేర లాభాలు పొందుతోంది. రష్యా చమురు అతి తక్కువ ధరలకు లభించడం వల్ల.. బీమా, రవాణా ఖర్చులు అన్నింటినీ కలుపుకొన్నాక కూడా మన రిఫైనరీలకు ఒక్కో బ్యారెల్‌పై డాలర్ నుంచి 1.25 డాలర్ల దాకా లాభం వస్తోంది.
రష్యా బాగు చేసుకుంటే..
రష్యా రిఫైనరీల సంక్షోభం మన దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలకు అందివచ్చిన అవకాశంగా మారినప్పటికీ.. ఈ ప్రయోజనాలు కొంతకాలమేనని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా తన చమురు శుద్ధి కర్మాగారాలను బాగు చేసుకున్నాక ఇతర దేశాలకు ఎగుమతులను తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఒకవేళ అదే జరిగి రష్యా చమురు శుద్ధి సామర్థ్యం పెరిగి.. ప్రస్తుతం తక్కువ ధరలకే అమ్ముతున్న చమురును మళ్లీ మార్కెట్ రేట్లకు అమ్మడం మొదలుపెడితే రోజుకు సగటున 18 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోళ్ల ధర పెరిగి.. భారత్‌పై ఏడాదికి అదనంగా రూ.80 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News