AICTE Report: గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల వెనుకబాటు
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:08 AM
దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు పనితీరులో వెనుకబడ్డాయని ఏఐసీటీఈ తెలిపింది..
కృత్రిమ మేధపై అవగాహన కరువు
దేశ వ్యాప్తంగా వెయ్యి గుర్తింపు
అప్‌గ్రేడ్‌కు సిద్ధమైన ఏఐసీటీఈ
జాబితాలో ఏపీ, తెలంగాణ సంస్థలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు పనితీరులో వెనుకబడ్డాయని ఏఐసీటీఈ తెలిపింది. మొత్తం 1000 కాలేజీల పనితీరు ఏమాత్రం బాగోలేదని పేర్కొంది. కృత్రిమ మేధపై అవగాహన కల్పించడంలో ఈ కాలేజీలు వెనుకబడ్డాయని, ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో పరిచయమే లేదని పేర్కొంది. మరో 500 కాలేజీలు ఉపాధి కల్పించే విషయంలో మరింత వెనుకబడినట్టు తెలిపింది. ఫలితంగా 5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. 2028 నాటికి ఉపాధి, ఉద్యోగాల కల్పనలో ఆయా కాలేజీలపాత్ర మెరుగు పడేలా చేయనున్నట్టు ఏఐసీటీఈ వివరించింది. దీనికి అమెరికాకు చెందిన మేకర్ భవన్ ఫౌండేషన్ సహాయం తీసుకోనున్నట్టు పేర్కొంది.
ఏపీలో 41, తెలంగాణలో 36
వెనుకబడిన గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఏపీ నుంచి 41, తెలంగాణ నుంచి 36 ఉన్నాయని ఏఐసీటీఈ తెలిపింది. అదేవిధంగా తమిళనాడులో అత్యధికంగా 128, కేరళలో 60, హరియాణాలో 43, పంజాబ్‌లో 33, యూపీలో 31, మహారాష్ట్రలో 29, గుజరాత్‌లో 25, కర్ణాటకలో 17, ఒడిశాలో 16, ఉత్తరాఖండ్, బెంగాల్‌లో 11 చొప్పున ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News