Share News

RSS: మధ్యతరగతిని ఆదుకోండి

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:54 AM

ముఖ్యంగా.. మధ్యతరగతి చైనా ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించే గొడుగులు, పాదరక్షలు వంటివాటిపై వసూలు చేస్తున్న టారి్‌ఫను తగ్గించాలని సూచించాయి. ప్రోత్సాహకాల ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని కోరాయి.

RSS: మధ్యతరగతిని ఆదుకోండి

చిన్న వ్యాపారాలను ప్రోత్సహించండి.. బడ్జెట్‌లో పన్నుభారాలు తగ్గించండి

కేంద్రానికి ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సూచన

త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ.. కాంగ్రెస్‌ విమర్శ.. ఆర్థికరంగంపై నివేదిక

ఈసారి సెగలే!.. నేటి నుంచే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. నేడు ఆర్థిక సర్వే

మధ్య తరగతి గంపెడాశలు.. నిర్మలమ్మ మురిపిస్తారా? మాయ చేస్తారా?

న్యూఢిల్లీ, జనవరి 30: కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో మధ్యతరగతికి ఊరట కలిగించే చర్యలనూ, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ కార్మిక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కోరాయి. ముఖ్యంగా.. మధ్యతరగతి చైనా ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించే గొడుగులు, పాదరక్షలు వంటివాటిపై వసూలు చేస్తున్న టారి్‌ఫను తగ్గించాలని సూచించాయి. ప్రోత్సాహకాల ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని కోరాయి. సంపన్నవర్గాలకు మేలు చేసే సంస్కరణలూ, రెవెన్యూను పెంచే చర్యలను కొనసాగిస్తూనే, మధ్యతరగతినీ, స్థానిక వ్యాపారులను ఆదుకునే చర్యలూ అవసరమని ఆర్‌ఎ్‌సఎస్‌ భావిస్తుంది. వీటిని తన ప్రాధాన్యాలుగా కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచింది. ఇందులోభాగంగా.. ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ సంస్థలు అయిన లఘే ఉద్యోగ్‌ భారతి (ఎల్‌యూబీ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ), స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎమ్‌)లకు చెందిన ప్రతినిధి బృందం గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసింది. శుక్రవారం నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ మరునాడే బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా.. బడ్జెట్‌ విషయంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రాధాన్యాలను మంత్రికి ఆ సంస్థలు నివేదించాయి. ముఖ్యాంశాలు ఇవీ..


విద్య, వైద్య ఖర్చులను నియంత్రించండి

మధ్యతరగతిపై జీవన వ్యయాల భారం తగ్గించాలి. పన్నుల విధింపులో ఉదాసీనంగా ఉండాలి. విద్య, వైద్యం వంటి అత్యవసర ఖర్చుల కోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న మధ్యతరగతి జీవులకు బడ్జెట్‌లో ఊరట ఇవ్వాలి. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలి. తేలిగ్గా రుణం దొరికి, సరుకు కొనుగోలు ఖర్చులు తగ్గి, రాయితీలు ఇతర ప్రోత్సాహకాలు ఇతోధికంగా లభించేలా చర్యలు తీసుకోవాలి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలి. కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను చిన్న పరిశ్రమలకు కూడా వర్తింపజేయాలి. కొత్త ఉద్యోగాల సృష్టి, దేశీయ ఉత్పత్తులకు ఊతం ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రక్రియ ఉండాలి.

విద్యకు గట్టి ప్రోత్సాహం...

జాతీయ విద్యా విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ విలువలు, చరిత్ర, ప్రాచీన జ్ఞాన సిద్ధాంతాలకు పాఠ్య ప్రణాళికలో చోటు కల్పించాలి. రాష్ట్రాల పరిధిలో ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ పాఠశాలలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన సంస్థలపై ఎక్కువగా ఖర్చు పెట్టాలి. దేశంలోని సకల విద్యా వ్యవస్థలూ, శిక్షణా కేంద్రాలపై ఏకీకృత నియంత్రణ ఉండాలి.


Also Read: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత

Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?

For National News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 05:49 AM