Rini Ann George Alleges: ఎమ్మెల్యేపై నటి సంచలన ఆరోపణలు.. మూడేళ్లుగా వేధిస్తున్నాడట..
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:50 PM
Rini Ann George Alleges: ఎమ్మెల్యేపై నటి రిని జార్జ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ యువ నాయకుడు తనను మూడేళ్లుగా వేధిస్తున్నాడని, అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడంటూ బాంబు పేల్చింది.
ప్రముఖ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు, ఎమ్మెల్యేపై నటి రిని జార్జ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ యువ నాయకుడు తనను మూడేళ్లుగా వేధిస్తున్నాడని, అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడంటూ బాంబు పేల్చింది. ఆ ఎమ్మెల్యే తనను ఓ సారి హోటల్‌కు రమ్మన్నాడని కూడా అంది. అయితే, ఆ రాజకీయనాయకుడు ఎవరు.. ఏ పార్టీకి చెందిన వాడన్న సంగతులు మాత్రం ఆమె చెప్పలేదు. అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటత్తిల్ పేరును తెరపైకి తెచ్చింది.
నటి రిని జార్జ్‌ను వేధించింది రాహుల్ అంటూ బీజేపీ నేతలు పాలక్కడ్ జిల్లాలోని పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. బీజేపీ ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు.. యూత్ కాంగ్రెస్ పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వాటిని కోర్టు ద్వారా నిజం అని నిరూపించాలి.
ఎక్కడా కూడా నా మీద పోలీస్ కేసు నమోదు కాలేదు’ అని అన్నారు. కాగా, ఈ రచ్చ మొదలవ్వడానికి కారణం ఓ వీడియో. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో జార్జియా మాట్లాడుతూ.. ‘ సోషల్ మీడియాలో నాకు ఓ రాజకీయ నాయకుడితో పరిచయం అయింది. అతడు నాతో మూడేళ్ల పాటు తప్పుగా ప్రవర్తించాడు. మొదట అసభ్యకరమైన మెసేజ్‌లు చేసేవాడు. తర్వాత ఓ సారి ఫైవ్ స్టార్ హోటల్‌కు రమ్మన్నాడు’ అని అంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు ఎమ్మెల్యే రాహుల్ అంటూ రచ్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి
18 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాగ్రత్త.. కరెన్సీ నోట్లు లెక్కపెట్టేటప్పుడు చూసుకోండి.. ఇలా కూడా మోసం జరగొచ్చు..