18000 Cr Projects: 18 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:45 PM
18000 Cr Projects: ఎన్‌హెచ్ 31పై 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శుక్రవారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో 18 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్‌లో 13 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్‌లో 5,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్ పర్యటన సందర్భంగా రెండు రైళ్లను ప్రారంభిస్తారు. గయ, ఢిల్లీల మధ్య తిరిగే అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును.. వైశాలి, కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌ను మోదీ ప్రారంభిస్తారు.
అంతేకాకుండా ఎన్‌హెచ్ 31పై 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది. ఈ బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా 13వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బీహార్ ప్రభుత్వం చెబుతోంది.‘ఈ బ్రిడ్జి కారణంగా ఆ ఏరియాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉత్తర బీహార్ అభివృద్ధి చెందుతుంది.
ఇక్కడి వారు ముడి సరుకుల కోసం ఇతర అవసరాల కోసం జార్ఖండ్, దక్షిణ బీహార్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారికి చాలా మేలు జరుగుతుంది’ అని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా నిర్మితమైన మెట్రో ట్రైన్ సర్వీసులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రేపు (ఆగస్టు 22)వ తేదీన మధ్యాహ్నం 4.15 గంటలకు మెట్రో సర్వీసును ప్రారంభిస్తారు. అంతేకాదు.. జెస్సోర్ రోడ్ నుంచి జై హింద్ భీమన్బందర్ (ఎయిర్ పోర్టు)వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు.
ఇవి కూడా చదవండి
ప్రేమ పెళ్లి.. ప్రియుడికోసం కట్టుకున్న భర్తను..
అమెరికాను భారత్ మునుపటిలా నమ్మదు.. ట్రంప్‌పై మండిపడ్డ ప్రముఖ ఆర్థికవేత్త