Share News

Bandi Sanjay: నెలాఖరులోపు స్వాతంత్య్ర యోధుల పింఛన్‌ కేసులు పరిష్కరించండి

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:26 AM

ఈ నెలాఖరులోగా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ కేసులు పరిష్కరించాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ...

Bandi Sanjay: నెలాఖరులోపు స్వాతంత్య్ర యోధుల పింఛన్‌ కేసులు పరిష్కరించండి

  • అధికారులకు బండి సంజయ్‌ ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ కేసులు పరిష్కరించాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎనిమీ ప్రాపర్టీస్‌ విక్రయాలతో సర్కారుకు రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులు, పునరావాస విభాగం, కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఫర్‌ ఇండియా(సీఈపీఐ) అధికారులతో మంగళవారం బండి సంజయ్‌ సమీక్షించారు. స్వాతంత్య్ర సైనిక్‌ సత్కార యోజన(ఎస్‌ఎ్‌సఎ్‌సవై) కింద 26,623, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ కోసం 8,829 ఫైళ్లు, ఎనిమీ ప్రాపర్టీస్‌ 12,800 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన పత్రాలు అందకే స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో సంబంధిత రాష్ట్రాలకు లేఖలు రాయాలని అధికారులను సంజయ్‌ ఆదేశించారు. వేగవంతంగా పింఛన్‌ మంజూరుకు ప్రత్యేక బృందాలను రాష్ట్రాలకు పంపాలని చెప్పారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్‌ కేసుల పురోగతిపై వివరాలు అందించాలని, వచ్చే నెలలో సీఈపీఐ శాఖ కార్యాలయాలను స్వయంగా సందర్శించి పురోగతిని సమీక్షిస్తానని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:26 AM