Share News

Madhya Pradesh: రేపిస్టుకు ఉరిశిక్ష రద్దు.. బయటకు వచ్చి మళ్లీ రేప్‌

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:25 AM

అరెస్టయిన కొంతకాలానికి జైలు నుంచి బయటికి రావడం.. మరో అకృత్యానికి పాల్పడటం అతడికి పరిపాటిగా మారింది. చివరిసారి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేయడంతో బయటికొచ్చిన ఆ ఉన్మాది తాజాగా మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు..

Madhya Pradesh: రేపిస్టుకు ఉరిశిక్ష రద్దు.. బయటకు వచ్చి మళ్లీ రేప్‌

భోపాల్‌, ఫిబ్రవరి 19: చిన్నారులపై వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ మృగాడిని న్యాయ వ్యవస్థ కఠినంగా శిక్షించకపోవడమే పాపమైంది.. అరెస్టయిన కొంతకాలానికి జైలు నుంచి బయటికి రావడం.. మరో అకృత్యానికి పాల్పడటం అతడికి పరిపాటిగా మారింది. చివరిసారి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేయడంతో బయటికొచ్చిన ఆ ఉన్మాది తాజాగా మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దబ్రిపురకు చెందిన రమేశ్‌ సింగ్‌ ఓ సీరియల్‌ రేపిస్ట్‌.. 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోర్టు అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.


శిక్ష అనంతరం బయటికొచ్చిన అతడు 2014లో 8 ఏళ్ల బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. దీంతో కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. అయితే 2019లో సాంకేతిక కారణాలతో హైకోర్టు అతడి ఉరిశిక్షను రద్దు చేసింది. మళ్లీ బయటకు వచ్చిన రమేశ్‌ మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 05:25 AM