Share News

Delhi: కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:19 AM

గురువారం మధ్యాహ్నం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మం త్రివర్గ ప్రమాణాలు చేయించారు.

Delhi: కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా.. మంత్రులుగా ఆరుగురి ప్రమాణం

తొలి క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఢిల్లీలో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి20: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మం త్రివర్గ ప్రమాణాలు చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్‌ వర్మ, మంజిందర్‌ సింగ్‌ సిర్సా, కపిల్‌ మిశ్రా, ఆశిశ్‌ సూద్‌, రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్‌, పంకజ్‌ సింగ్‌ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రు లు, బీజేపీ సీఎంలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎం లు, డిప్యూటీ సీఎంలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రివర్గ ప్రమాణం తర్వాత ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఎన్డీయే నేతలకు లంచ్‌ ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్డీయే నేతల ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. రానున్న రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో విపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఢిల్లీ యమునా నదీ తీరంలోని వాసుదేవ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన హారతి కార్యక్రమంలో కొత్త మంత్రివర్గం పాల్గొంది.

h.jpg

ఆ తర్వాత సచివాలయంలో జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఆప్‌ సర్కారు పదేళ్ల పాలనపై కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఢిల్లీలో అమలు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.


ఎవరెవరికి ఏ పదవులు?

ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆర్థిక, విజిలెన్స్‌ శాఖలతో పాటు, మహిళా, శిశు సంక్షేమ, సాధారణ పరిపాలన శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. పర్వేశ్‌ వర్మకు ప్రజాపనులు, జలవనరులు, వ్యవసాయ శా ఖలు కేటాయించారు. ఆశిశ్‌ సూద్‌కు హోం, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. మంజింద ర్‌ సింగ్‌ సిర్సాకు పరిశ్రమలు, పర్యావరణ శాఖలు, కపిల్‌ మిశ్రాకు న్యాయ, పర్యాటక శాఖలను, పంకజ్‌ కుమార్‌ సింగ్‌కు ఆరోగ్యశాఖ, రవీందర్‌ ఇంద్రజ్‌ సిం గ్‌కు సామాజిక సంక్షేమ శాఖలను కేటాయించారు.


వికసిత్‌ ఢిల్లీ కోసం ఉద్యమం: రేఖ

ఇంటినుంచి బయలుదేరినప్పుడు సీఎం అవుతానని తనకు తెలియదని రేఖా గుప్తా వెల్లడించారు. తన పేరును పర్వేశ్‌ వర్మ ప్రతిపాదించేదాకా తనకు తెలియదన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, వికసిత్‌ ఢిల్లీ కోసం ఉద్యమ తరహాలో శ్రమిస్తామన్నారు. కేజ్రీవాల్‌ హయాంలో నిర్మించిన శీశ్‌మహల్‌(అద్దాల మేడ)ను మ్యూజియంగా మారుస్తామన్నారు.

అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్‌ గుప్తా

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్‌ గుప్తా ఎంపికయ్యారు. ఎన్నికల్లో ఆయన రోహిణి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2015లో నాటి ఆప్‌ ఎమ్మెల్యే అల్కాలాంబాపై ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సభలో కలకలం రేగింది. సభలో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నారంటూ విజేందర్‌ గుప్తాను నాటి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఆయన్ను మార్షల్స్‌ సభ బయటకు తీసుకెళ్లారు. పదేళ్ల విజేందర్‌ గుప్తా స్పీకర్‌గా ఎంపికయ్యారు.


ఇవి కూడా చదవండి:

Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 05:19 AM