Rapido: 75 సార్లు పొమ్మన్నారు.. వదల్లేదు, రూ.9350 కోట్లు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:26 PM
75 సార్లు పొమ్మన్నారు. అయినా కాని ఈ తెలుగు కుర్రోడు.. పట్టువదలని విక్రమార్కుడయ్యాడు. కట్ చేస్తే, రూ.9,350 కోట్ల విలువైన కంపెనీని స్థాపించి లీడ్ చేస్తున్నాడు.
హైదరాబాద్: దేశంలో ఐఐటీ పాసైన విద్యార్థుల గురించి మాట్లాడినప్పుడల్లా భారీ ప్యాకేజీలతో మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన వారి కథలు మనకు తారసపడుతుంటాయి. కానీ కొందరు కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి, పెద్ద కలలను కన్న కొంతమంది యువకులు.. దానిని నిజం చేసుకోవడానికి ప్రతి సవాలును స్వీకరించిన ఉదంతాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ మన తెలుగు గడ్డకు చెందిన పవన్ గుంటుపల్లిది. అతను 75 సార్లు పెట్టుబడిదారుల నుంచి నో అనే సమాధానం వచ్చినా తన ఆశయాన్ని వదులుకోలేదు. నేడు రూ.9,350 కోట్ల విలువైన కంపెనీకి కారణమయ్యాడు.
ర్యాపిడో ఎలా ప్రారంభమైంది?
పవన్ గుంటుపల్లి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2015-16లో ర్యాపిడోకు పునాది వేశారు. ముఖ్యంగా ఆటో లేదా ట్యాక్సీ సౌకర్యాలు పరిమితంగా ఉన్న నగరాల్లో సామాన్యులకు చౌకగా, ఇంకా వేగవంతమైన రవాణా సౌకర్యాల ఎంపిక అందించడమే అతని లక్ష్యం. కానీ అతను తన ఆలోచన కోసం పెట్టుబడిదారులను సంప్రదించినప్పుడు, అతను 75 సార్లకు పైగా తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ర్యాపిడో వంటి సేవ.. అప్పటికే పాతుకుపోయిన ఓలా, ఉబర్‌లను ఎదుర్కొని వాటికి ధీటుగా నిలబడ్డం ఇక్కడ ముదావహమైన అంశం.

పవన్ ముంజాల్ మద్దతు మలుపు తిప్పింది
ఈ క్లిష్ట సమయంలో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్... పవన్ గుంటుపల్లి దార్శనికతను అర్థం చేసుకుని ర్యాపిడోకు ఆర్థిక సహాయం అందించారు. దీని తరువాత, ఇతర పెట్టుబడిదారులు కూడా ముందుకు వచ్చారు. దీంతో ర్యాపిడో అధికారికంగా 2016లో ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా తన రెక్కలను విస్తరించడం ప్రారంభించింది. తిరుగులేని సంస్థగా ఎగురుతోంది. చిన్న వయసులోనే పవన్ గుంటుపల్లి పలువురు యువతకు ఆదర్శప్రాయుడయ్యారు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి