Share News

PM Modi Will Retire After 2024: 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్‌

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:43 AM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే...

PM Modi Will Retire After 2024: 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్‌

రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. 2047లో భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ఆయన రిటైర్‌ అవుతారని ప్రకటించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘చాలా చిన్న వాస్తవం ఏమిటంటే.. సమీప భవిష్యత్తులో ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు. రానున్న ఎన్నికల్లో మోదీజీయే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు. 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లోనూ ఆయనే మా పార్టీ అభ్యర్థి. 2047లో దేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరిగిన తరువాత ఆయన రిటైర్‌ అవుతారు’’ అని చెప్పారు. తనకు 1980 నుంచి మోదీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం ఆయనలో ఉందని ప్రశంసించారు. సంక్షిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారని, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల నాయకులు సయితం ఆయన సలహాలు తీసుకుంటారని చెప్పారు. అంతమంది ప్రపంచ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం స్పందించిన తీరే మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ముందు ఆయన మూడు దళాల అధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో చర్చలు జరిపారని అన్నారు. 2013లో మోదీని బీజేపీ జాతీయ ప్రచార కన్వీనర్‌గా, అనంతరం ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన తీరును రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సీనియర్‌ నాయకుడు ఎల్‌.కె. అద్వానీని అగౌరవపరచలేదని, కానీ మోదీ నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 06:43 AM