Cough Syrup Issue: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:47 PM
రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్..
జైపూర్, అక్టోబర్ 4: రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. సికార్ జిల్లాలో డెక్స్‌ట్రోమెథార్ఫాన్ లిప్యుట్ కలిగి ఉన్న కాఫ్ సిరప్ తాగిన పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చేరారు. వీరిలో మొత్తం ముగ్గురు పిల్లలు మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అటు మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మరణాలతో కలిపి మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు.
దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. మందుల నాణ్యతా ప్రమాణాల విషయంలో అలసత్వం చూపారనే కారణంపై డ్రగ్ కంట్రోలర్ రాజారాం శర్మను విధుల నుంచి సస్పెండ్ చేసింది. జైపూర్‌కు చెందిన కేసన్స్ ఫార్మా కంపెనీ తయారు చేసిన 19 మందులు, ముఖ్యంగా డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కలిగి ఉన్న కాఫ్ సిరప్‌ల పంపిణీని పూర్తిగా ఆపేసింది. 2012 నుంచి 10,000కి పైగా శాంపిల్స్ పరీక్షించగా 42 మందుల నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని RMSCL ఎండీ పుఖ్రాజ్ సేన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఈ అంశంపై హైలెవల్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. మందుల నాణ్యతపై ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ ప్రకారం పిల్లలు, గర్భిణులకు సంబంధించి ప్రమాదకర మందుల వార్నింగ్ లేబుల్స్ తప్పనిసరి చేశారు. అటు, కేంద్రం 2021 అడ్వైజరీ ప్రకారం 4 ఏళ్ల లోపు పిల్లలకు డెక్స్‌ట్రోమెథార్ఫాన్ ఇవ్వొద్దని పునరుద్ఘాటించింది.
తమిళనాడులో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌లో డయిథైలీన్ గ్లైకాల్ (DEG) కలుపుతున్నారని ల్యాబ్ టెస్టులు నిర్ధారించాయి. దీంతో కంచీపురంలోని శ్రేసన్ ఫార్మా ప్రొడక్షన్‌ను ఆపేసి, లైసెన్స్ రద్దు చేసేందుకు షో-కాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సిరప్ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు సరఫరా అయినట్టు నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి..
అధికారుల దురాశ.. పల్టీ కొట్టిన క్రేన్
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు..
Read Latest Telangana News And Telugu News