RailOne App: రైల్ వన్ యాప్‌లో టిక్కెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసా..
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:05 PM
భారతీయ రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన రైల్‌వన్ సూపర్ యాప్‌లో (RailOne App) అనేక రకాల సేవలు ఉన్నాయి. ఈ యాప్‌లో ఐఆర్‌సీటీసీ సహా భారతీయ రైల్వేలు అందించే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రియల్ టైం స్టేటస్, ఫ్లైట్, బస్ సేవలు కూడా కలవు. వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ రైల్వే కొత్తగా రైల్‌వన్ సూపర్ యాప్‌ను (RailOne App) ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ఐఆర్‌సీటీసీ సహా భారతీయ రైల్వేలు అందించే దాదాపు అన్ని ప్రధాన సేవలను ఒకే చోట లభిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో లభ్యమయ్యే ఈ యాప్.. టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ సమాచారం, సీటు లభ్యత, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక రైలు సంబంధిత సేవలను అందిస్తుంది.
రైల్‌వన్ యాప్ ప్రత్యేకతలు
రైల్‌వన్ యాప్ యూజర్ల సౌలభ్యం కోసం రూపొందించబడింది. ఈ యాప్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ ఈజీగా ఉంటుంది. హోమ్‌పేజీలో వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారి పేరు కనిపిస్తుంది. దాని కింద అన్ని సేవలను సూచించే పెద్ద చిహ్నాలు కూడా ఉంటాయి. ఈ విభాగంలో ప్రయాణికులు రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ లేదా ప్లాట్‌ఫాం టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన టికెట్ రకాన్ని ఎంచుకుని, వివరాలను నమోదు చేసి టికెట్‌లను పొందవచ్చు.
మరిన్ని సేవలు
మోర్ ఆఫరింగ్స్ విభాగంలో ప్రయాణికులు తమ జర్నీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే పీఎన్ఆర్ స్థితిని చెక్ చేసుకోవచ్చు. కోచ్ స్థానాల గురించి తెలుసుకోవచ్చు. రైలు సేవలకు సంబంధించి ఫిర్యాదు నమోదు చేయాలనుకునే వినియోగదారులు రైల్ మదద్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పలు రకాల సమస్యలను నివేదించవచ్చు. ప్రయాణికులు రైల్‌వన్ యాప్ ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ డెలివరీ చేసే అనేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ సేవను బుక్ చేసుకోవడానికి వినియోగదారులు తమ పీఎన్ఆర్ నంబర్‌ను నమోదు చేసి, తమకు ఇష్టమైన స్టేషన్‌లో ఫుడ్ ఎంచుకోవచ్చు.
రైల్‌వన్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే విధానం
ముందుగా రైల్‌వన్ యాప్‌ను ఓపెన్ చేయండి
హోమ్‌పేజీలో రిజర్వ్‌డ్ టికెట్ విభాగంపై క్లిక్ చేయండి
మీ ప్రయాణ వివరాలు, గమ్యస్థానం, తేదీని నమోదు చేయండి
ఆ తర్వాత అమౌంట్ పే చేసి, మీ బుకింగ్‌ను ధృవీకరించుకోండి
రైల్‌వన్ యాప్‌లో పీఎన్ఆర్ చెక్ చేసే విధానం
హోమ్‌పేజీలో మోర్ ఆఫరింగ్స్ కింద ఉన్న పీఎన్ఆర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఆ తర్వాత పీఎన్ఆర్ నంబర్‌ను నమోదు చేయండి
మీ బుకింగ్ వివరాలను చూడటానికి పీఎన్ఆర్‌ను సమర్పించండి
రైలు సమాచారం, ప్రయాణ తేదీ, సీటు స్థితి, రాబోయే స్టేషన్లు, తదుపరి స్టాప్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు
రైల్ మదద్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసే విధానం
వీడియో, చిత్రం లేదా ఆడియో ఉపయోగించి మీ సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు
ఆ క్రమంలో రైలులో లేదా స్టేషన్‌లో సహాయం కావాలా అని ధృవీకరించాలి
మీ సమస్యను స్పష్టంగా వివరించండి
ఆ క్రమంలో మీ ఫిర్యాదును సమర్పించండి
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి