Share News

Rahul Gandhi Granted Bail: పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:18 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత

Rahul Gandhi Granted Bail: పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

రాంచీ, ఆగస్టు 6: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఝార్ఖండ్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 2018లో చైబాసాలో జరిగిన ర్యాలీలో అమిత్‌ షాపై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రతా్‌పకుమార్‌ అనే వ్యక్తి ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ సాగుతోంది. జూన్‌లో విచారణకు హాజరు కావాలని గతంలో చైబాసా ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలిచ్చింది. అయుతే ఆయన హైకోర్టును ఆశ్రయించి ఆగస్టు 6న విచారణకు హాజరయ్యేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం చైబాసా కోర్టులో విచారణకు రాహుల్‌ స్వయంగా హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:18 AM