Rahul-Brazilian Model: రాహుల్ గాంధీ చేసిన పనితో బ్రెజిల్ మోడల్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:21 PM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న'హెచ్ ఫైల్స్' పేరుతో చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. రాహుల్ ప్రెస్ మీట్ దెబ్బకి బ్రెజిలియన్ మోడల్ లారిసాకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి..
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న'హెచ్ ఫైల్స్' పేరుతో చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. పేద్ద స్క్రీన్‌తో భారీ ప్రెస్ మీట్ నిర్వహించిన రాహుల్, 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందన్నారు. దీన్నే ఆయన 'హైడ్రోజన్ బాంబు' పేలుస్తానంటూ కొంత కాలంగా ఊరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, రాహుల్ ఆరోపించిన ఓట్ల చోరీ అంశంలో ఒకటి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే.. రాయి నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటో 22 సార్లు.. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమ్లా అనే పేర్లతో 10 బూత్‌లల్లో ఓట్లు వేశారని రాహుల్ ఆరోపించారు. ఇంతకీ రాహుల్ చూపిన ఆ ఫోటో ఎవరిదంటే.. బ్రెజిల్ హెయిర్‌డ్రెస్సర్ లారిసా నెరీ (Larissa Nery)ది. 8 ఏళ్ల క్రితం ఈ ఫొటో స్టాక్ ఫోటో సైట్‌లో అప్‌లోడైంది. 4 లక్షలు డౌన్‌లోడ్లు అయింది.
అయితే, రాహుల్ ప్రెస్ మీట్ దెబ్బకి లారిసా ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అనేకమంది ఆమెకు ఫోన్ చేయడం, మెసేజ్ లు చేయడం ప్రారంభించారు. ఒక పక్క మీడియా, మరో పక్క నెటిజన్లు చంపేస్తుండటంతో లారిసాకి చిర్రెత్తుకొస్తోంది. 'ఏం పిచ్చిదీ? నా ఫోటో ఇండియా ఎన్నికల్లో ఎలా వచ్చింది? రిపోర్టర్లు మెసేజ్ చేస్తున్నారు!' అంటూ వాపోతోంది.