Rahul Gandhi Robert Vadra: మా బావను పదేళ్లుగా వేధిస్తున్నారు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:24 AM
గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తన బావను వేధిస్తోందని శుక్రవారం రాహుల్ గాంధీ ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూలై 18: గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తన బావను వేధిస్తోందని శుక్రవారం రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలోని షికోపూర్‌లో జరిగిన భూఒప్పందంలో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్‌వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ‘‘దురుదేఽ్దశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనే ధైర్యం రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి ఉందని నాకు తెలుసు. నేనూ వారికి అండగా నిలుస్తాను. అంతిమంగా సత్యమే గెలుస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఇది కాంగ్రెస్ ఎమరె ్జన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శనం. న్యాయవ్యవస్థను గౌరవించని మాటలివి’’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. రాహుల్‌కు తన బావ చేసిన చీకటి వ్యవహారాల గురించి తెలుసని, వాటిలో ఆయనకూ భాగస్వామ్యం ఉందేమోనని అన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి