Rahul Gandhi Accuses Modi: ఓట్ల తారుమారుకు మోదీ యత్నం
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:04 AM
ఓటర్ల జాబితాలను తారుమారు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు...
అరారియా, ఆగస్టు 24: ఓటర్ల జాబితాలను తారుమారు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. బిహార్లో జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా పేదల ఓట్లు దొంగిలించాలని ఆయన అనుకుంటున్నారని విమర్శిఽంచారు. చిన్న పిల్లలు సైతం ‘ఓట్ల దొంగా.. గద్దె దిగు’ అంటున్నారని.. ఈసీ వారితో మాట్లాడాలని సూచించారు. ఆయన చేపట్టిన ‘ఓటర్ అఽధికార యాత్ర’ ఆదివారం అరారియా చేరుకుంది.ఓటర్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్, తేజస్వి బుల్లెట్‌పై కాసేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి భద్రతావలయాన్ని ఛేదించుకుని వచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దుపెట్టాడు. వెంటనే భద్రతాసిబ్బంది అతడిని కొట్టి సెక్యూరిటీ జోన్‌కు దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా, బిహార్లో ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ల డాక్యుమెంట్ల తనిఖీ ముమ్మరంగా సాగుతోందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇప్పటివరకు 98.2 శాతం మంది డాక్యుమెంట్లు సమర్పించారని తెలిపింది. ధ్రువపత్రాలకు ఇంకా 8రోజుల సమయం మాత్రమే ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News