Share News

Radha Krishnan: రాజీపడని జాతీయవాదిని

ABN , Publish Date - Sep 11 , 2025 | 03:24 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్‌.. తనను తాను..

Radha Krishnan: రాజీపడని జాతీయవాదిని

  • గవర్నర్‌గా జ్ఞాపకాలు పదిలం: సీపీ రాధాకృష్ణన్‌

  • ఉప రాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం

  • రాధాకృష్ణన్‌ను కలిసిన జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిఛి

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్‌.. తనను తాను ’రాజీపడని జాతీయవాది’గా పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా 13నెలల పదవీకాలం.. తన ప్రజా జీవితంలో అత్యంత సంతోషకరమైన దశగా మిగిలిపోతుందని, ఆ జ్ఞాపకాలు తనతోనే ఉంటాయని అన్నారు. 67 ఏళ్ల రాధా కృష్ణన్‌ మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి బి. సుదర్శన్‌ రెడ్డిని 152ఓట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న రాష్ట్రపతి ముర్ము రాధాకృష్ణన్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తారని అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్‌తో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో వీరి భేటీ జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా రాధాకృష్ణన్‌కు.. సుదర్శన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్

కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్

For More National News and Telugu News

Updated Date - Sep 11 , 2025 | 03:24 AM