Punjabi Singer Death: విహార యాత్రకు వెళ్లి పంజాబీ సింగర్ మృతి.. భార్య వద్దని చెప్పినా..
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:33 PM
పంజాబీ సింగర్ రాజ్‌వీర్ జవాండా (35) బుధవారం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్దీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులకు పైగా చికిత్స పొందుతూ..
Punjabi Singer Death News: పంజాబీ సింగర్ రాజ్‌వీర్ జవాండా (35) బుధవారం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్దీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులకు పైగా చికిత్స పొందుతూ మృతిచెందారు. తల, మెడకు తీవ్రమైన గాయాలతో పాటు గుండె సంబంధిత సమస్యలతో పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. అయితే భార్య వద్దని ముందే హెచ్చరించినా విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె విహార యాత్ర వద్దని చెప్పినా రాజ్‌వీర్ మాటలు వినలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సింగర్ రాజ్‌వీర్ జవాండా ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు తన 1300 సీసీ మోటారు సైకిల్‌పై విహారయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే సోలన్ జిల్లా సమీపంలో అడ్డుగా వచ్చిన పశువులను బైక్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఆయన తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని అక్కడి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 11 రోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పరిస్థితి పూర్తిగా విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
రాజ్‌వీర్ జవాండా మృతిపై ఆప్ నేత మనీశ్ సిసోదియా సహా పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్‌వీర్ జవాండా.. లుథియానా జాగ్రావ్‌లోని పోనా గ్రామానికి చెందినవాడు. పంజాబీలో పలు పాటలు పడి అభిమానుల్ని స్వంతం చేసుకున్నారు. ఈయన పాటలు పాడటమే కాకుండా ‘సుబేదార్ జోగిందర్ సింగ్’, ‘జింద్ జాన్’, ‘మిండో తసీల్‌దర్ని’ వంటి సినిమాల్లోని నటించి మెప్పించారు.
Also Read:
Illegal Relation: అర్ధరాత్రి యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే బిగ్ షాక్..!
Success Tips: జీవితంలో విజయం సాధించాలంటే ఈ అలవాట్లను మార్చుకోండి.!
Picture Puzzle: మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 30 సెకెన్లలో కనిపెట్టండి