Share News

Illegal Relation: అర్ధరాత్రి యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే బిగ్ షాక్..!

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:14 PM

ఇటీవల కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. యువతులపై యువకులు, యువకులపై యువతులు, భర్తపై భార్య, భార్యపై భర్త, వరకట్నం వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఏకంగా ప్రైవేట్ పార్ట్ పైనే..

Illegal Relation: అర్ధరాత్రి యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే బిగ్ షాక్..!
Woman Attacks Youth

లక్నో, అక్టోబర్ 08: ఇటీవల కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. యువతులపై యువకులు, యువకులపై యువతులు, భర్తపై భార్య, భార్యపై భర్త, వరకట్నం వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఏకంగా ప్రైవేట్ పార్ట్ పైనే ఓ వివాహిత కత్తితో దాడి చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జరిగింది.


జౌన్‌పూర్ జిల్లా సరపతహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డకహా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఉండే 22 ఏళ్ల యువకుడిని అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ తన ఇంటికి రాత్రి పిలిచి, అతని ప్రైవేట్ పార్ట్ పై కత్తితో దాడి చేసింది. యువకుడికి రక్తస్రావం కావడంతో నేలపై పడిపోయి కొంతసేపు నొప్పితో బిగ్గరగా కేకలు వేశాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు యువకుడి దగ్గరకు వచ్చారు. తీవ్ర రక్త స్రావంతో పడి ఉన్న ఆ యువకున్ని చూసి భయభ్రాంతులకు గురై వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే యువకుడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతన్ని ఉత్తమ చికిత్స కోసం వారణాసికి రిఫర్ చేశారు.


అయితే దాడి చేసిన సదరు మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త అహ్మదాబాద్‌లో పని చేస్తున్నాడు. ఆ యువకుడికి, మహిళకు సంబంధం ఏంటి? ఆ యువకుడిపై మహిళ ఎందుకు దాడి చేసింది అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మధ్య వివాహేతర సంభంధం ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు యువకుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఈ ఘటనపై శాహ్‌గంజ్ డీఎస్పీ అజిత్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ‘సరపతహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డకహా గ్రామంలో ఒక మహిళ తన ఇంటికి పిలిచి గ్రామంలోని యువకుడిపై దాడి చేసింది. యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వారణాసికి పంపించారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం' అని వివరించారు.


Also Read:

విజయానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే

మీ బ్రెయిన్‌కు పరీక్ష.. 3 తేడాలు కనిపెట్టండి..

Updated Date - Oct 08 , 2025 | 02:14 PM