Share News

Man Catches Wife: భార్యను పట్టించిన జీపీఎస్ సిగ్నల్.. అసలేమైందంటే..

ABN , Publish Date - Dec 16 , 2025 | 02:35 PM

మన దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, కాలం గడిచే కొద్ది ఆ వివాహ బంధానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. క్షణకాల ఆనందం కోసం.. కాపురాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

Man Catches Wife: భార్యను పట్టించిన జీపీఎస్ సిగ్నల్.. అసలేమైందంటే..
Man Catches Wife

చండీగఢ్, డిసెంబర్ 16: మన దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఆ వివాహ బంధానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. క్షణకాల ఆనందం కోసం.. కాపురాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్య తనను ఏ విధంగా మోసం చేస్తుందో బహిర్గతం చేశాడు. కట్టుకున్న భార్యను ప్రాణంగా ప్రేమిస్తే.. తనను దారుణంగా మోసం చేసిందంటూ బాధిత వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం..


రవి గులాటీ, హిమానీలకు 2010లో వివాహం జరిగింది. కొంతకాలం ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. సాఫీగా, సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. దీంతో పచ్చని కాపురంలో చిచ్చు రేగింది. 2018లో హిమానీ తన ప్రియుడితో ఓ హోటల్‌లో కలిసి ఉండగా భర్త రవి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రవి.. హిమానీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. హిమానీ క్షమాపణలు చెప్పి.. మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని బ్రతిమాలడంతో రవి అంగీకరించాడు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా హిమానీ చేసిన తప్పును రవి క్షమించాడు. ఈ ఘటన తరువాత కొంతకాలం వీరి జీవితం సాఫీగానే సాగింది.


కానీ, కాలం గడిచిన కొద్ది హిమానీలో మళ్లీ మార్పు మొదలైంది. ఎక్కువగా ఫోన్లు మాట్లాడటంతో పాటు.. ఆమె ప్రవర్తనలోనూ తేడా రావడంతో రవిలో అనుమానం పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా హిమానీ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చాలా సమయం అయినప్పటికీ ఆమె ఇంటికి రాలేదు. దీంతో రవి ఆమెకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు. అప్పటికే అనుమానంతో ఉన్న రవి.. ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చగా.. దాని సహకారంతో లొకేషన్ ట్రేస్ చేశాడు. స్కూటీ ఒక హోటల్ వద్ద ఉండటాన్ని గుర్తించాడు. అక్కడ తన భార్య మరొక వ్యక్తితో ఉండటం చూసి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ సమయంలోనూ వీరిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. భర్త రవితో ఉండటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని హిమానీ తేల్చి చెప్పింది.


రవి గులాటీ మాట్లాడుతూ.. ‘హిమానితో నాకు 2010లో వివాహం జరిగింది. 2018లో నా భార్య మరొక వ్యక్తితో హోటల్‌లో కనిపించింది. ఆ సమయంలోనే ఆమెను హెచ్చరించాను. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాను. మాకు చిన్న పిల్లలు ఉండటంతో ఆమెను క్షమించాను. పరిస్థితులు సర్దుకుంటాయని, తను మారుతుందని భావించాను. కానీ, ఇప్పటికీ తను మారలేదని అర్థమైంది. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్నం 3, 3:3 గంటల సమయంలో నా భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది. 15 నుంచి 20 సార్లు కాల్ చేశాను. కానీ, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హిమానీ ప్రవర్తనపై ఏడాది కాలంగా అనుమానం ఉండేది. అందుకే.. ఆమె వినియోగిస్తున్న స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చాను. ఆ ట్రాకర్ సహాయంతో తను ఉన్న హోటల్ వద్దకు వెళ్లాను. హిమానీ తన ప్రియుడితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను.’ అని రవి చెప్పుకొచ్చాడు.


రవి తండ్రి పర్వేజ్ గులాటీ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఏడు సంవత్సరాల క్రితం హిమానీ ఇలాగే దొరికింది. ఆ సమయంలో ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడాము. ఆమె క్షమాపణలు కోరింది. దీంతో సమస్య సమసిపోయిందని భావించాను. కానీ, ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేసింది హిమానీ. ఓ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. హిమానీ తన భర్తతో ఉండనని చెబుతోంది. పుట్టింట్లోనే ఉంటానని చెబుతోంది. హిమానీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి పర్వేజ్‌ను తన సోదరుడిగా పరిచయం చేసింది. పర్వేజ్.. హిమాని ఇంటికి తరచుగా వెళ్లేవాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు హిమానీ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నించాము. కానీ, వారి నుంచి ఎలాంటి రెస్పాండ్స్ రాలేదు.’ అని చెప్పుకొచ్చారు.


ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. కాగా, రవి గులాటీ మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.


Also Read:

IPL 2026: మినీ వేలం లైవ్ అప్‌డేట్స్

శీతాకాలంలో పొడి చర్మంతో బాధపడుతున్నారా? ఇలా చేయండి..

Updated Date - Dec 16 , 2025 | 02:35 PM