IPL 2026: మినీ వేలం లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Dec 16 , 2025 | 01:54 PM
ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధం అయింది. ఈ ప్రక్రియ అబుదాబీ వేదికగా జరుగుతుంది. తమ జట్టుకు కావాల్సిన నైపుణ్యమున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
Live News & Update
-
Dec 16, 2025 17:51 IST
ఇంకా జట్ల వద్ద ఉన్న అమౌంట్ ఇదే..
CSK- రూ.13 కోట్లు
DC- రూ. 9.40 కోట్లు
GT- రూ. 12 కోట్లు
KKR- రూ. 15.50 కోట్లు
LSG-రూ.15.35 కోట్లు
MI- రూ. 1.75 కోట్లు
Punjab Kings- రూ.11.50 కోట్లు
RR- రూ.7.35 కోట్లు
RCB- రూ.7.40 కోట్లు
SRH- రూ. 25.20 కోట్లు
-
Dec 16, 2025 17:48 IST
అబుదాబిలో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ-వేలంలో టీ విరామం తీసుకున్నారు.
-
Dec 16, 2025 17:38 IST
సుశాంత్ మిశ్రాను రూ.90 లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
విజ్ఞేశ్ పుతుర్‌ను కూడా రూ.30 లక్షలకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.
ప్రశాంత్ సోలంకిని రూ.30 లక్షలకు కేకేఆర్ దక్కించుకుంది.
-
Dec 16, 2025 17:35 IST
నమ్‌తివారీ కనీస ధర రూ.30లక్షలు
నమన్ తివారీని రూ.కోటి వెచ్చించి ఎల్‌ఎస్‌జీ దక్కించుకుంది.
కార్తిక్ త్యాగిని రూ.30లక్షలతో కేకేఆర్ సొంతం చేసుకుంది.
అశోక్ శర్మ కనీస ధర రూ.30 లక్షలు
రూ.90 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది.
అతడి కోసం కేకేఆర్, ఆర్‌ఆర్, గుజరాత్ పోటీ పడ్డాయి.
-
Dec 16, 2025 17:23 IST
తేజస్వి సింగ్‌ను రూ.3 కోట్లతో కేకేఆర్ దక్కించుకుంది.
తేజస్వి సింగ్ కోసం ముంబయి, కేకేఆర్, ఆర్‌ఆర్ పోటీ పడ్డాయి.
ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
మకుల్ కోసం ముంబయి, రాజస్థాన్, లక్నో పోటీపడ్డాయి.
-
Dec 16, 2025 17:17 IST
కార్తిక్ శర్మకు రూ.14.20 కోట్లు
కార్తిక్ శర్మ కనీస ధర రూ.30లక్షలు
రూ.14.20 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై
కార్తిక్ శర్మ కోసం కేకేఆర్, చెన్నై, ఎస్ఆర్‌హెచ్ పోటీ పడ్డాయి.
-
Dec 16, 2025 17:01 IST
ప్రశాంత్ వీర్‌కు రూ.14.20 కోట్లు
ప్రశాంత్ వీర్ కనీస ధర రూ.30లక్షలు
రూ.14.20 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
శివాంగ్ కుమార్ కనీస ధర రూ.30 లక్షలతో సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
-
Dec 16, 2025 16:58 IST
అకిబ్ దార్‌కు రూ.8.40 కోట్లు
అకిబ్‌దార్ కనీస ధర రూ.30లక్షలు
రూ.8.40 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
అకిబ్‌దార్ కోస పోటీపడ్డ ఢిల్లీ, హైదరాబాద్
-
Dec 16, 2025 16:17 IST
రవి బిష్ణోయ్‌కు రూ.7.20 కోట్లు
రవిబిష్ణోయ్ కనీస ధర రూ.2కోట్లు
రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
అకేల్ హొస్సేన్‌ను కనీస ధర రూ.2కోట్లతో సీఎస్కే సొంతం చేసుకుంది.
-
Dec 16, 2025 16:13 IST
ఎల్‌ఎస్‌జీకి నార్ట్జే
దక్షిణాఫ్రికా ప్లేయర్ అన్రిచ్ నార్ట్జేను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
కేవలం రూ. 2 కోట్లకే అతడిని ఎల్ఎస్‌జీ దక్కించుకుంది.
-
Dec 16, 2025 16:09 IST
పతిరాణాను కొనుగోలు చేసిన కేకేఆర్
శ్రీలంక పేసర్ మతీషా పతిరాణాను రూ.18కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
ఇతడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ తమ పర్సు నుండి మరో భారీ మొత్తాన్ని వెచ్చించింది.
ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అత్యధిక ధర పలికిన ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు కేకేఆర్ వద్ద ఉన్నారు.
-
Dec 16, 2025 15:54 IST
ఆర్సీబీలోకి న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ
జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
ఆకాశ్ దీప్ అన్‌సోల్డ్
గతేడాది మెగా వేలంలో రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన భారత పేసర్ ఆకాష్ దీప్.. ఈ మినీ వేలంలో ప్రస్తుతానికి అమ్ముడుపోలేదు. అతని కనీస ధర రూ. 1 కోటికి కూడా ఏ బిడ్ రాలేదు.
మరో భారత పేసర్ శివమ్ మావి కూడా అతడి కనీస ధర రూ. 75 లక్షలకు అమ్ముడుపోలేదు.
దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ అన్‌సోల్డ్
-
Dec 16, 2025 15:42 IST
క్వింటన్ డికాక్‌కు రూ.కోటికి సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్
సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్ కనీస ధర రూ.కోటి
ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో అన్‌సోల్డ్( కనీస ధర రూ.కోటి)
జెమీ స్మిత్ అన్‌సోల్డ్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్‌కు రూ.2కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
బెన్ డకెట్ కనీస ధర రూ.2కోట్లు
ఫిన్ అలెన్ - అమ్ముడుపోయాడు, కేకేఆర్ (రూ. 2 కోట్లు)
-
Dec 16, 2025 15:34 IST
ప్రారంభమైన సెట్ 3 వికెట్ కీపర్లు వేలం
కేఎస్ భరత్ అన్‌సోల్డ్ (కనీస ధర రూ.75లక్షలు)
దీపక్ హుడా అన్‌సోల్డ్( కనీస ధర రూ.75 లక్షలు)
-
Dec 16, 2025 15:32 IST
వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ
కేకేఆర్ బిడ్డింగ్ నుండి వైదొలగడంతో, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అతన్ని రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.
గతేడాది కూడాఈ రెండు ఫ్రాంచైజీలు వెంకటేష్ కోసం భారీ బిడ్డింగ్ వేశాయి. చివరకు కేకేఆర్ అతన్ని రూ. 23.75 కోట్లకు దక్కించుకుంది.
-
Dec 16, 2025 15:19 IST
శ్రీలంక క్రికెటర్ హసరంగను రూ.2కోట్లకులక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది.
-
Dec 16, 2025 15:16 IST
రచిన్ రవీంద్ర, వియాన్ ముల్డర్, లివింగ్ స్టోన్ అన్‌సోల్డ్‌గా అయ్యారు.
-
Dec 16, 2025 15:12 IST
సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్
ఇండియన్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కనీస ధర రూ.75లక్షలు ఉంది.
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున సర్ఫరాజ్ ఇవాళ(మంగళవారం) మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేశాడు.
సూపర్ బ్యాటింగ్ చేసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు
-
Dec 16, 2025 15:07 IST
భారీ ధర పలికిన కామెరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
కామెరూన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు
కామెరూన్ కోసం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
-
Dec 16, 2025 14:47 IST
ప్రారంభమైన తొలి సెట్ బ్యాటర్ల వేలం
ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. అన్‌సోల్డ్‌గా మిగిలాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
భారత బ్యాటర్ పృథ్వీ షా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. అన్‌సోల్డ్ అయ్యాడు.
-
Dec 16, 2025 14:40 IST
IPL 2026 Auction: తొలి సెట్‌లో ఉన్న బ్యాటర్లు వీరే
ఐపీఎల్ 2026 వేలం ప్రారంభమైంది.
తొలి సెట్ బ్యాటర్లలో కనీస ధర రూ.2 కోట్లతో డేవాన్ కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్ వేలంలోకి రానున్నారు.
వారి తర్వాత సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), పృథ్వీ షా (రూ.75 లక్షలు) వేలంలోకి రానున్నారు.
-
Dec 16, 2025 14:28 IST
ఐపీఎల్ (IPL 2026)కోసం అబుదాబీ వేదికగా ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 2:30 నుంచి మినీ వేలం ప్రారంభమైంది. తమ జట్లలోకి నైపుణ్యమున్న ప్లేయర్లను తీసుకోవడం కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. జట్ల అభ్యర్థనల మేరకు చివరి నిమిషంలో కొత్తగా 19 మంది ఆటగాళ్లను వేలం ప్రక్రియలో చేర్చారు.
-
Dec 16, 2025 13:55 IST
ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంతుందంటే..?
కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ.64.30 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ - రూ.43.40 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ.25.50 కోట్లు
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ - రూ.22.95 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.21.80 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.16.40 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ - రూ.16.05 కోట్లు
గుజరాత్ టైటాన్స్ - రూ.12.90 కోట్లు
పంజాబ్ కింగ్స్- రూ.11.50 కోట్లు
ముంబై ఇండియన్స్- రూ.2.75 కోట్లు
-
Dec 16, 2025 13:54 IST
మరికొద్దిసేపట్లో..
ఐపీఎల్ 2026కి సంబంధించి మరికొద్ది సేపట్లో మినీ వేలం ప్రారంభం కానుంది.
మొత్తం పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొననున్నాయి.