Premalatha: డీఎండీకే జతకట్టిన కూటమిదే విజయం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:49 AM
వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే జతకట్టిన కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అన్నారు. తిరుచ్చి మానగర జిల్లా డీఎండీకే కార్యదర్శి టీవీ గణేష్ ఇంటి శుభకార్యం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమలత విజయకాంత్ విలేఖరులతో మాట్లాడుతూ... తాము చేపట్టిన ‘ఉల్లం తేడి ఇల్లం నోడి’ రెండో విడత రథయాత్ర సెప్టెంబరు 5న ప్రారంభమై 10 రోజులు జరుగుతుందన్నారు.
- ప్రేమలత విజయకాంత్
చెన్నై: వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే జతకట్టిన కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్(Premalatha Vijaykanth) అన్నారు. తిరుచ్చి మానగర జిల్లా డీఎండీకే కార్యదర్శి టీవీ గణేష్ ఇంటి శుభకార్యం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమలత విజయకాంత్ విలేఖరులతో మాట్లాడుతూ... తాము చేపట్టిన ‘ఉల్లం తేడి ఇల్లం నోడి’ రెండో విడత రథయాత్ర సెప్టెంబరు 5న ప్రారంభమై 10 రోజులు జరుగుతుందన్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చేపట్టిన ప్రచారం, తాము చేపట్టిన ప్రచారం వేరని తెలిపారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకావాలన్నదే తమ అభిప్రాయమన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా దేశానికి, ప్రజలకు మంచి పాలన అందించేందుకు సాధ్యమవుతుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే భాగస్వామ్యమైన కూటమి విజయం సాధిస్తుందని, ఏ కూటమిలో తాము చేరాలి అన్న దానిపై జనవరి 9వ తేదీన నిర్వహించనున్న మహానాడులో చర్చించి నిర్ణయం తీసుకుంటాన్నామని తెలిపారు.
ప్రస్తుతం పార్టీ బలోపేతం చేసేలా ప్రచారం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎంజీఆర్ అనంతరం ప్రజలకు గుర్తుకొచ్చేది విజయకాంత్ అని, ఏ పార్టీ అయినా విజయకాంత్‌ను ప్రస్తావించకుండా ఉండలేరని అన్నారు. ఆయన గురించి మాట్లాడడం తమకు సంతోషంగా ఉందన్నారు. టీవీకే మహానాడులో కార్యకర్తలను బౌన్సర్లు తోసివేయడం అన్ని పార్టీల్లోనూ జరుగుతుందని, పథకం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని ప్రేమలత విజయకాంత్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News