Share News

Premalatha: వర్సిటీ అత్యాచారం కేసులో.. ‘ఆ సార్‌’ ఎవరో తేల్చండి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:16 PM

అన్నా వర్సిటీల విద్యార్థిని అత్యాచారం కేసులో ‘ఆ సార్‌’ ఎవరో ఇప్పటివరకు తెలియలేదని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్‌ చేశారు.

Premalatha: వర్సిటీ అత్యాచారం కేసులో.. ‘ఆ సార్‌’ ఎవరో తేల్చండి

- డీఎండీఎంకే సభలో తీర్మానం

చెన్నై: అన్నా వర్సిటీల విద్యార్థిని అత్యాచారం కేసులో ‘ఆ సార్‌’ ఎవరో ఇప్పటివరకు తెలియలేదని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్‌ చేశారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రేమలత అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, పుదుకోట సామాజిక సేవకులు జగబర్‌ అలీ, ఆ పార్టీ ప్రముఖుడు కేఆర్‌ రామలింగం చిత్రపటాలకు ప్రేమలత నివాళులర్పించారు.

ఈ వార్తను కూడా చదవండి: Delhi New CM: ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..


ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, డీఎండీకే జెండాను పరిచయం చేసి 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని ఆమె పార్టీ జిల్లా కార్యదర్శులకు సూచించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.


nani1.2.jpg

తెంకాశి, పుదుకోట, తిరుచ్చి, వేలూరు(Tenkasi, Pudukkottai, Trichy, Vellore) ప్రాంతాల్లోవున్న రాళ్ల, ఇసుక క్వారీలను ఇష్టానుసారంగా దోచుకుంటున్న నేపథ్యంలో, ప్రస్తుతం మళ్లీ 13జిల్లాలను ఇసుక క్వారీలను నడిపేందుకు ఎంపిక చేసినట్లు డీఎంకే ప్రభుత్వం ప్రకటించడం ఖండించదగ్గదన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో సంబంధాలున్న ఆ సార్‌ ఎవరో ఇప్పటివరకు తెలియలేదని, అతడిని అరెస్టు చేయాలని ప్రేమలత డిమాండ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 12:16 PM