Share News

Preeti Saran Appointed: ఐరాస హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సరన్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:15 AM

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా భారత్‌కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్‌ నియమితులయ్యారు...

Preeti Saran Appointed: ఐరాస హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సరన్‌

న్యూయార్క్‌, సెప్టెంబరు 14: ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా భారత్‌కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్‌ నియమితులయ్యారు. జెనీవా కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది. ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల వ్యాప్తికి భారత్‌ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఉన్నత పదవి ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:15 AM