Precision Strikes: ఆకాశ్‌తీర్‌తో ఆటకట్టు
ABN , Publish Date - May 17 , 2025 | 04:52 AM
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అత్యంత కచ్చితమైన దాడులతో పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాలను ఛేదించింది. దేశీయంగా తయారైన ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా నాశనం చేసింది.
పాక్‌కు అడ్డుగోడగా నిలిచిన రక్షణ వ్యవస్థ
దాయాది ఎన్నడూ చూడని అస్త్రంతో దెబ్బ
న్యూఢిల్లీ, మే16: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఎనిమిది వైమానిక స్థావరాలు సహా 13 లక్ష్యాలను భారత్ అత్యంత కచ్చితత్వంలో ఎలా ఛేదించగలిగింది ? ఈ దాడులను అడ్డుకోవడంలో పాక్ ఎందుకింత ఘోరంగా విఫలమైంది ? ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రూపొందించి, అభివృద్ధి చేసిన ఆకాశ్‌తీర్ అనే గగనతల రక్షణ వ్యవస్థ పాక్ ఆటకట్టించిందని, వాళ్లు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, మైక్రో యూఏవీలను సమర్థవంతంగా కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించిందని వివరించింది. దేశీయంగా తయారైన ఆకాశ్‌తీర్ అంచనాలకు మించి రాణించిందంటూ దీని సత్తాను తెలియజేసింది.
ఆకాశ్‌తీర్ ప్రత్యేకతలివే...
ఈ నెల 9, 10వ తేదీల్లో భారత్‌లోని సైనిక, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడింది. అయితే, దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్‌తీర్ రక్షణగోడగా నిలిచి ఆ దాడులను అడ్డుకుంది.
పాక్ నుంచి దూసుకొచ్చే డ్రోన్లు, క్షిపణులు, మైక్రో యూఏవీ (మానవరహిత వైమానిక వాహనాలు)లు భారత భూభాగంలో పడకుండా ఆకాశ్‌తీర్ నిరోధించింది. దీనిలో ఉన్న అత్యంత విధ్వంసక అంశం ఏమిటంటే.. భూమిపై ఉన్న రక్షణ వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా వాతావరణం, భూభాగం, రాడార్ ఇంటర్‌సె్‌ప్టల నుంచి డేటాను సంగ్రహించి.. రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకోగలదు. స్వయంప్రతిపత్తితో దాడులు అమలుచేసే సామర్థ్యం దీనిలో ఉంది. ఇలాంటి వ్యవస్థను ఎన్నడూ చూడలేదని పాక్ రక్షణ రంగ నిపుణులే అన్నారంటే దీని సత్తా అర్థం చేసుకోవచ్చు.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రూపొందించిన ఆకాశ్‌తీర్.. భారత పరాక్రమాన్ని ప్రదర్శించే స్వదేశీ ఉత్పత్తి. ఆకాశ్‌తీర్‌కు పోటీగా చెప్పుకునే.. పాకిస్థాన్ వైమానిక రక్షణ (ఏడీ) నెట్‌వర్క్‌లో చైనాకు చెందిన హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 అనే గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అవి మన వైమానిక దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి.
ఆకాశ్‌తీర్ అనేది పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ. దీనిలో భాగస్వామ్యమైన అన్ని వ్యవస్థల (కంట్రోల్ రూమ్, రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ గన్స్) కు పరిస్థితి తీవ్రతను రియల్‌టైమ్‌లో అందిస్తుంది. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించి, ట్రాకింగ్ చేసి, వాటిపై చర్యలు తీసుకునేలా ఎయిర్ డిఫెన్స్‌ను అందిస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్ రాడార్ వ్యవస్థలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఒకే కార్యచరణ చట్రంలోకి తీసుకువస్తుంది.
ఆకాశ్‌తీర్ విస్తృతమైన సీ4ఐఎ్‌సఆర్ (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, సర్వేలెన్స్, రికనైసెన్స్) ఫ్రేమ్‌వర్క్‌లో భాగం. ఇది ఇతర వ్యవస్థలను సమన్వయం చేసుకుని పనిచేస్తుంది. శక్తితో కాక బుద్ది బలంతో యుద్ధం చేస్తుంది.
ఆకాశ్‌తీర్ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల ఎయిర్ డిఫెన్స్‌పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తుందనే నమ్మకం ఇచ్చింది.
ఆకాశ్‌తీర్‌తో భారత్ కూడా పూర్తిగా ఆటోమేటెడ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్, సీ అండ్ ఆర్ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో చేరింది. ఆకాశ్‌తీర్ ఊహించినదాని కంటే వేగంగా శత్రువుని గుర్తిస్తుందని, వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని, వేగంగా దాడి చేస్తుందని నిరూపితమైంది. ఆకాశ్‌తీర్ వ్యవస్థను వాహనంపై అమర్చవచ్చు. ప్రతికూల వాతావరణంలోనూ సులువుగా నిర్వహించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News