Share News

Bihar Assembly Elections: బిహార్‌లో కింగ్‌మేకర్‌ పీకే

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:26 AM

త్వరలో జరుగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ కింగ్‌ మేకర్‌గా మారనున్నట్టు తాజా ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. ఆయన పార్టీకి 8.3 శాతం ఓట్లు...

Bihar Assembly Elections: బిహార్‌లో కింగ్‌మేకర్‌ పీకే

  • తాజా ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడి

పట్నా, సెప్టెంబరు 15: త్వరలో జరుగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ కింగ్‌ మేకర్‌గా మారనున్నట్టు తాజా ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. ఆయన పార్టీకి 8.3 శాతం ఓట్లు దక్కనున్నట్టు ఆదివారం ప్రకటించి న సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారనే ప్రశ్నకు 13.70 శాతం మంది పీకే పేరును వెల్లడించారు. అత్యధికంగా 33.5 శాతం మంది ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సీఎం కావాలని ఆకాంక్షించగా, 24 శాతం మంది ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌ను కోరుకున్నారు. నిరుద్యోగం, సమగ్ర ఓటర్ల సవరణ(ఎ్‌సఐఆర్‌) ఎన్నికల్లో ప్రభావం చూపనున్న కీలక అంశాలుగా ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సర్వేలో వెల్లడైన వివరాల మేరకు అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహాగట్‌బంధన్‌ మధ్య గట్టి పోటీ నెలకొననుంది. సర్వేలో పాల్గొన్నవారిలో 36.2 శాతం మంది ఎన్డీయేకు, 35.8 శాతం మంది ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో కూడిన మహా కూటమికి మద్దతు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 06:26 AM